NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

మతాంతర వివాహం అయినా…వారు మేజర్‌లు..అలహాబాదు హైకోర్టు కీలక తీర్పు.

 

దేశ వ్యాప్తంగా లవ్ జీహాద్, మతాంతర వివాహాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. లవ్ జీహాద్‌కు వ్యతిరేకంగా బీజేపీ పాలిత ప్రభుత్వాలు హిందు యువతులను ముస్లిం వ్యక్తులను వివాహం చేసుకోవడాన్ని నేరంగా పరిగణించే చట్టానికి రూపకల్పన చేయాలని భావిస్తున్నారు. మధ్యప్రదేశ్, అస్సోం, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలు ఈ మేరకు చట్టాన్ని రూపొందించేందుకు సిద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు  అలహాబాద్ హైకోర్టు ఒక మతాంతర వివాహంపై కీలకతీర్పును వెలువరించడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

అసలు ఏమి జరిగింది అంటే..

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రియాంక ఖన్వార్ (హిందు), సలామత్ అన్సారీ (ముస్లిం) గత ఏడాది ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ యువకుడి వినతి మేరకు పెళ్లికి ముందు ప్రియాంక మత మార్పిడి చేసుకున్నది. తన పేరు ప్రియాంక నుండి అలియాగా మార్చుకున్నది. అయితే వీరి వివాహంపై యువతి కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ కుమార్తెను కిడ్నాప్ చేసి బలవంతంగా మత మార్పిడి చేయించి వివాహం చేసుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై సలామత్ అన్సారీతో పాటు మరో ముగ్గురిపై పోలీసులు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. దీంతో సలావత్, ప్రియాంక దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. కేసు కొట్టేసి తమకు రక్షణ కల్పించాలని పిటిషన్‌లో కోరారు.

సలామత్ పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తులు వివేక్ అగర్వాల్, పంకజ్ నఖ్వీల నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం సుమారు సంవత్సర కాలంగా విచారణ జరిపి నేడు తీర్పు వెలువరించింది. వివాహ సమయంలో ప్రియాంక అలియాస్ అలియా వయసు 21 సంవత్సరాలు అయినందన ఆమె మైనర్ కాదని పేర్కొంది. అలియా తన భర్తతో కలిసి జీవించేందుకు కోర్టు అనుమతి కల్పించింది. అంతే గాక ఈ కేసులో పోస్కో చట్టం వర్తించదని ధర్మాసనం తేల్చి చెప్పి సలామత్ ఇతురలపై ఉన్న కేసును కొట్టివేసింది.

మేజర్‌లు అయిన ఇద్దరు వ్యక్తులు తమ అభీష్టం మేరకు బందం ఏర్పరుచుకొనవచ్చని, ఇందులో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదని ధర్మాసనం పేర్కొన్నది. అలా చేస్తే వారి హక్కులను భంగం కల్గించిట్లే అవుతుందన్నారు. మత మార్పిడి వివాహాల చెల్లుబాటుపై తాము ఇప్పుడు స్పందించబోమని పేర్కొన్నది. ఈ కేసులో హిందువా, ముస్లిమా అనేది చూడమని, వారు మేజర్లా కాదా అనేదే పరిగణలోకి తీసుకున్నామని తెలిపింది.

 

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju