కొరటాల శివ డైరక్షన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్న విషయాన్ని కూడా ఎంతో ఆసక్తికరంగా మార్చడంలో మంచి పట్టు ఉన్న డైరక్టర్ కొరటాల శివ. అందుకే ఈ డైరెక్టర్ తీసిన ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టింది. ఈ డైరెక్టర్ పనితనాన్ని చూసి మెగా స్టార్ కూడా ఆయనతో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది.
ఆ సినిమానే ఆచార్య. ఈ చిత్రంలో మెగా స్టార్ నక్సలైట్ గా మారిన ఒక ప్రొఫెసర్ పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం. అలాగే ఈ సినిమాలో చరణ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడట. గెస్ట్ రోల్ కు ఎక్కువ ఫుల్ రోల్ కు తక్కువ చరణ్ పాత్ర ఉంటుందని తెలుస్తోంది. దాంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరుగిపోతున్నాయి.
అలాగే ఆచార్య సినిమాలో చరణ్ స్టూడెంట్ లీడర్ గా కనిపిస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబందించిన షూటింగ్ త్వరలో జరగబోతుందని సినిమా యూనిట్ తెలుపుతోంది. ఇదే గనుకు జరిగితే బొమ్మ అదిరిపోవడం కాయమని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఈ సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్న సినిమా కన్ఫర్మ్ అయ్యిందని తెలుస్తోంది.
ఈ సినిమాలో బన్నీ హీరోగా నటించనున్నారంట.ఈ చిత్రంలో బన్నీ స్టూడెంట్ లీడర్ గా కనిపించబోతున్నాడని అనధికార సమాచారం. ఈ సినిమా పూర్తిగా స్టూడెంట్ రాజకీయాల నేపథ్యంలో ఉండబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే భారీ అంచనాలు ఉండే కొరటాల శివ సినిమాలకు.. స్టార్లు జత కావడం ఎంతో సంతోషించే విషయమని పలువురు అంటున్నారు.
అయితే ఆచార్య సినిమాలో చరణ్ , అల్లు అర్జున్ తన నెక్ట్స్ సినిమాలో సూడెంట్ లీడర్లుగా కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ పాత్రల్లో వారు ఎంత బాగా యాక్ట్ చేస్తారో వేచి చూడాలి. అయితే మెగా అభిమానులు మాత్రం ఈ సినిమాలు ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయా అని వేచి చూస్తున్నారని తెలుస్తోంది.