NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

సీఎస్ గుంజాటం… సర్కారు కు జంజాటం ; ఆంధ్రాలో అన్ని వివాద వస్తువులే

 

 

ఐఏఎఎస్ అవగానే ప్రతి అధికారి… పనిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా.. రిటైర్ నాటికీ చీఫ్ సెక్రటరీ హోదాలో బయటకు రావాలని కలలు కంటారు.. ఓ ఐఏఎస్ కు అత్యున్నత అధికారం కేబినెట్ కార్యదర్శి అయితే, రాష్ట్ర స్థాయిలో మాత్రం చీఫ్ సెక్రటరీ.. దీంతో ప్రతి సివిల్ సెర్వెంట్ తనకు కేటాయించిన రాష్ట్ర కేడర్ అత్యున్నత పదవి లోకి వెళ్లాలని భావిస్తారు.. ఇదంతా ఎందుకు అంటే….. ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ లు ఇప్పుడు తమ కేరిర్ లోనే అత్యున్నత పదవిగా భావించే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టేందుకు ఇష్టపడడం లేదు. దీనితోపాటు కొత్త సమస్యలు వచ్చేలా ఉంది పరిస్థితి అవేంటో చూద్దాం రండి 

ఈనెల చివరితో ప్రస్తుత ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవి విరమణ చేయనున్నారు. ఇప్పటికే ఆమె పదవిని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించాలని చేసిన అభ్యర్థనను ఒకసారి కేంద్రం మన్నించింది. మరోసారి పదవి పెంపు కుదరదు. దీంతో కొత్త సంవత్సరము ఆంధ్రప్రదేశ్కు కొత్త సీఎస్ రాక ఖాయమైంది. అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను ఎవరికి అప్పగించాలి అనే అంశంలో ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఎలాంటి లీగల్ సమస్యలు రాకుండా సీఎస్ ఎంపిక చేయడానికి, తమకు అనుకూలంగా ఉన్న వారిని నియమించేందుకు జగన్ ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. అంత కసరత్తు చేయాల్సిన అవసరం ఏముంది?? సీనియార్టీ ప్రాతిపదికన నీలం సాహ్ని తర్వాత ఎవరైతే సీనియర్ అవుతారో వారే కదా తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యేది?? దీనిలో సమస్య ఏముంది అని అనుకుంటున్నారా??? అయితే ఇది మొత్తం చదివేయండి….

** ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని తర్వాత సీనియర్ గా ఆమె భర్త అజయ్ ప్రకాష్ సాహ్ని ఉన్నారు. నీలం సాహని కంటే ఆమె భర్త అజయ్ ప్రకాశాన్ని రెండేళ్లు చిన్న. 1960లో నీలం సాహ్ని పుడితే, అజయ్ సాహ్ని 1962లో పుట్టారు. ఇద్దరిదీ ఒకే బ్యాచ్. అజయ్ సాహిని తర్వాత 1985 బ్యాచ్ కు చెందిన సమీర్ శర్మ, రెడ్డీ సుబ్రహ్మణ్యం లు వరుసగా ఉన్నారు. సమీర్ శర్మ ఉత్తరప్రదేశ్ కు, రెడ్డీ సుబ్రహ్మణ్యం ఆంధ్రకే చెందిన వారు. ఈ ముగ్గురిలో ఒకరికి నీలం సాహ్ని తర్వాత సి ఎస్ అయ్యే అవకాశం ఉంది. లెక్క ప్రకారం చూస్తే నీలం సాహ్ని తర్వాత ఆమె భర్త అజయ్ సాహ్నికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే అజయ్ సాహ్ని తోపాటు సమీర్ శర్మ రెడ్డి సుబ్రమణ్యం ముగ్గురు ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో నే ఉన్నారు. వీరు గత కొంతకాలంగా ఢిల్లీలోనే కొనసాగుతున్నారు. వీరిని అక్కడ రిలీవ్ చేయించి రాష్ట్రానికి రప్పించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చేయడం ప్రభుత్వ పెద్దలకు అంత ఇష్టం లేదు. రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి పై పూర్తి అవగాహన లేకుండా కేంద్ర సర్వీసుల్లో రిలీవ్ చేయించి ఇక్కడ అత్యున్నత ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడం అంత సమంజసంగా ఉండదు అనేది ప్రభుత్వ పెద్దల మాట అయితే… ప్రస్తుత ప్రభుత్వ తీరుతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న వ్యక్తికి లేనిపోని తలనొప్పులు ఉంటాయనే కోణంలోనే సీనియర్ లైన ఈ ముగ్గురు సైతం సి ఎస్ పదవికి పోటీ పడకుండా మిన్నకుండి పోయారని, ఢిల్లీ వర్గాల టాక్. జగన్ ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శి హోదాలో లేనిపోని తలనొప్పులు భరించలేనని కొందరు చెప్పడంతోనే అధికారులు కనీసం సిఎస్ పదవి కోసం రిలీవ్ కాకుండా ఢిల్లీలోనే కొనసాగుతున్నారని కొందరు సర్వేల్ సర్వెంట్స్ చెబుతున్న మాట.

 

** ఆ ముగ్గురి పరిస్థితి అలా ఉంటే వారి తర్వాత సీనియర్ అయినవారికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదా దక్కాలి. ఆ ముగ్గురి తర్వాత డి. సాంబశివరావు ఉన్నారు అయితే ఈయనను నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేదు. టీడీపీ మనిషిగా ఆయనను ప్రభుత్వం భావిస్తోంది. తర్వాత పేరు అభయ్ త్రిపాఠి. ఈయన ప్రస్తుతం ప్లానింగ్ కమిషన్, ఢిల్లీ కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. దీంతో ఆ పేరు తేలిపోయింది. సీనియర్టీ లిస్ట్ లో తర్వాత పేరు సతీష్ చంద్ర. టిడిపి ప్రభుత్వ హయాంలో దాదాపు అన్నీ తానై చూసుకున్న సతీష్ చంద్రని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తే లేనిపోని తలనొప్పులు కొనితెచ్చుకున్నట్లే అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. జగన్ ప్రభుత్వం వచ్చాక సతీష్ చంద్ర ఆయన పని ఆయన చూసుకుంటున్నారు. ఆయనకు అప్పగించిన శాఖలను ఆయన నిర్వర్తిస్తున్నారు. అయితే గతంలో ఉన్న మచ్చను ప్రాతిపదికగా తీసుకొని జగన్ ప్రభుత్వం ఆయన పేరును సిఎస్ పదవికి పరిశీలించడం లేదు. సాంబశివరావు, అభయ్ త్రిపాఠి, సతీష్ చంద్ర ముగ్గురు 1986 బ్యాచ్ కు చెందిన వారు. ఈ ముగ్గురి నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడంతో తర్వాత పేరు పరిశీలిస్తోంది.

 

** తర్వాత పేరులోనూ ఇబ్బందులు కనిపిస్తున్నాయి. 1987 బ్యాచ్ కు చెందిన జేఎస్ వెంకటేశ్వర ప్రసాద్ సొంత రాష్ట్రం ఆంధ్రకు చెందిన వారి. అయితే ఈయన ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతున్నారు. కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వెంకటేశ్వర ప్రసాద్ తర్వాత నీరబ్ కుమార్ ప్రసాద్.. టీడీపీ ప్రభుత్వ హయాంలో కీలకమైన శాఖలు చూసిన ఈయన ప్రాధాన్యత లేని శాఖలను చూస్తున్నారు. ఆయన ను నియమించేందుకు ప్రభుత్వం అంతా ఆసక్తి చూపడం లేదు. దీంతో 1987 బ్యాచ్ అభ్యర్థిగా, తర్వాత ఉన్న పేరు ఆదిత్యనాథ్ దాస్. ప్రస్తుతం జలవనరుల శాఖ ప్రధాన కార్యదర్శి గా కొనసాగుతున్న ఈయన సీనియార్టీ లిస్టు లో కింద ఉన్నా, ప్రభుత్వానికి చక్కగా పని చేయగలరని జగన్ భావిస్తున్నారు. బీహార్కు చెందిన ఆదిత్యనాథ్ దాస్కు 59 ఏళ్ళు. నియమిస్తే మరో ఏడాది పాటు ఆయన కొనసాగుతారు. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గా వరంగల్ జిల్లా కలెక్టర్గా పనిచేసిన ఆదిత్యనాథ్ ఇప్పుడు సీనియారిటీ జాబితా లో ప్రభుత్వానికి కనిపిస్తున్న ఓ మంచి పేరు. అన్నీ కలిసి వస్తే ఆదిత్యనాథ్ దాస్ నీలం సాహ్ని తర్వాత జగన్ ప్రభుత్వంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. దాదాపు ఆదిత్యనాథ్ దాస్ పేరునే జగన్ ప్రభుత్వం సైతం ఓకే చేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.

లీగల్ సమస్యలు రావా??

అఖిల భారత సర్వీసు అధికారుల సమస్యలను, వారిపై ప్రభుత్వాలు తీసుకునే చర్యలను ట్రిబ్యునల్ పరిధి పర్యవేక్షిస్తుంది. సీనియారిటీ లిస్టు లో కింద ఉన్న ఆదిత్యనాథ్ దాస్ నియామకం చేస్తే, సీనియార్టీ లో ముందున్న మిగిలిన సర్వీసు అభ్యర్థులు ట్రిబ్యునల్ను ఆశ్రయించారు పరిస్థితి ఏమిటనేది ప్రశ్న. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని నియమించుకునే అధికారం హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయి. అదే పరిస్థితిలో సీనియార్టీ ప్రాతిపదికన అఖిల భారత సర్వీసు అధికారులను ఎలాంటి కారణం చూపకుండా పదోన్నతులు ఆగడానికి లేదా వారి పదవీ బాధ్యతలు తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు లేవు. అయితే ఇదే పరిస్థితి గతంలో రాష్ట్ర డీజీపీగా నండూరి సాంబశివరావు నియమించే సమయంలోనూ తలెత్తింది. ఆ సమయంలో రేసులో మా ముందున్న వారికీ సరిసమానమైన బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ట్రిబ్యునల్కు నివేదించింది. బాధ్యతల్లో కానీ పదోన్నతులు వేతనంలో కానీ ఎలాంటి కోత పెట్టలేదని ట్రిబ్యునల్కు నివేదించడం తో ఆ కేసు వీగిపోయింది. ఇప్పుడు కూడా సీనియారిటీ జాబితాలో ముందు ఉన్న వారికి కీలకమైన బాధ్యతలను అప్పగించి, వారి స్థాయి తగ్గించకుండా వేతనం అదే అదే ఇస్తూ తమకు ఇష్టమైన వారిని సీఎస్ గా నియమైంచుకోవచ్చు అని ప్రభుత్వం భావిస్తోంది.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju