NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బీజేపీలోకి జానారెడ్డి … రాహుల్ గాంధీ చెప్పినా ఆగేది లేదు

తెలంగాణ‌లో గ‌త కొద్దిరోజులుగా ఎన్నిక‌ల వేడి కొన‌సాగుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక‌, అనంత‌రం గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల సంద‌డి జ‌రిగింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో మరో నియోజకవర్గంలో ఉప ఎన్నిక తప్పనిసరి పరిస్థితి నెలకొంది..

 

నోముల నర్సింహయ్య ప్రాతినిథ్యం వహించిన నాగార్జునసాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలోనే ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. అయితే, ఈ ఉప ఎన్నిక విష‌యంలో ట్విస్టుల మీద ట్విస్టులు కొన‌సాగుతున్నాయి.

జానారెడ్డి కేరాఫ్ ట్విస్టులు

తెలంగాణ‌లోని సీనియ‌ర్ రాజ‌కీయ వేత్త‌ల్లో జానారెడ్డి ఒక‌రు. కీల‌క‌మైన నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం పేరు చెప్పగానే జానారెడ్డి పేరు వెంటనే గుర్తుకు వస్తుంది. సుదీర్ఘకాలం పాటు ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు జానారెడ్డి ఎన్నో కీలక పదవులను అధిష్టించారు. అయితే, గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నేత‌ నోముల న‌ర్సింహ‌య్య‌ చేతిలో ఓటమి పాలయ్యారు. నోముల మృతితో ఉప ఎన్నిక తప్పని పరిస్థితి ఏర్పడడంతో మరో సారి జానారెడ్డి పోటీ చేయడం ఖాయమని అంతా భావిస్తున్న తరుణంలో సంచలన వ్యాఖ్యలు చేశారు

ద‌టీజ్ జానారెడ్డి …

నాగార్జున‌సాగ‌ర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం గురించి జానారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం లేదని స్పష్టం చేసిన ఆయన రెండేళ్ల కోసం తాను పోటీచేసి ఏం లాభం అని ప్రశ్నించారు. ఎన్నికల్లో పోటీచేయనని గతంలోనే చెప్పానని.. రాహుల్ గాంధీ వచ్చి చెప్పినా తన నిర్ణయం మారబోదన్నారు. ఉప ఎన్నికల్లో తన కుమారుడు పోటీ చేస్తారని జానారెడ్డి మ‌రో ట్విస్టు ఇచ్చారు. అంతే కాకుండా , నాగార్జున సాగర్ లో పార్టీ అధిష్టానం ఎవ్వరికి టికెట్ ఇచ్చిన కలిసి పనిచేస్తామని వెల్ల‌డించారు. దీంతో పాటుగా ఇంకో బాంబ్ పేల్చారు.

బీజేపీలోకి జానారెడ్డి ?

బీజేపీలోకి జానా రెడ్డి అంటూ గ‌త కొద్దికాలంగా ప్ర‌చారం జోరుగా జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై జానా రెడ్డి మ‌రింత క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు రానున్నాయని ఆయన అన్నారు. తాను పార్టీ మారడం కేవలం ప్ర‌చారం మాత్రమేనని తేల్చి చెప్పారు. త‌న‌ను ఎవ్వరూ సంప్రదించలేదని , తాను ఎవరిని సంప్రదించలేదని జానారెడ్డి కొట్టిపారేశారు. పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వికి ముందు వరుసలో తానే ఉండాలి కానీ అధిష్టానం ఎవ్వరికిచ్చిన సహకరిస్తానని ఆయన అన్నారు.

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju