బరువు తగ్గడంలో ముఖ్యమైనవి ఆహార నియమాలు, వ్యాయామం. అయితే, బరువు తగ్గడం కోసం వ్యాయామం చేయడం వల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది, ఎముకలు బలపడతాయి ఒత్తిడి తగ్గుతుంది. మంచి శరీరాకృతి అందరూ కోరుకుంటారు. అయితే కొందరుమాత్రం వాటికోసం తెగ కష్టపడుతుంటారు. పొద్దున్నే లేచి జిమ్‌లు జాగింగ్ అంటూ చెమటోడ్చే ప్రయత్నం చేస్తుంటారు.వాకింగ్, జాగింగ్ తర్వాత చెప్పుకునేది సైక్లింగ్.
మంచి గాలి పీల్చుకుంటూ, అలా సైకిల్ మీద నాలుగు రౌండ్లు వెళ్లి వస్తే వచ్చే ఆనందమే వేరు. సైకిల్ బరువు తగ్గడానికే కాదు, ఆరోగ్యానికి కూడా చాల మంచిది . అయితే అధిక బరవుతో బాధపడుతున్నవారికి ఇది ఓ అద్భుతమైన వ్యాయామం అని చెబుతున్నారు పరిశోధకులు. ఎందుకంటే సైక్లింగ్‌కు మించిన మంచి వ్యాయామం లేదని, సరైన శరీరాకృతికి సైక్లింగ్ సరైనది అని డెన్మార్క్‌లోని కొపెన్‌గన్ యూనివర్సిటీ పరిశోధకులు తెలియచేసారు.
అధిక బరువు తో బాధపడుతున్నా? జిమ్‌కు వెళ్లేంత సమయం లేకపోయినా.. శరీరం లో కేలరీలు తగ్గించుకోవాలనుకున్నా రోజూ ఓ గంట సేపు సైకిల్ తొక్కడానికి సమయం కేటాయిస్తే చాలు. ఒకవేళ ఆఫీసు దగ్గర్లోనే ఉంటే.. ఆఫీసుకి ,చిన్నపనులకి కూడా సైకిల్ మీదే వెళ్తే ఇంకా మంచి ఫలితం పొందవచ్చని కోపెగన్ యూనివర్శిటీ పరిశోధకులు చెబుతున్నారు.
వారం లో ఐదుసార్లు జిమ్‌కు వెళ్లి వ్యాయామం చేస్తే శరీరం లో ఎంత కొవ్వు కరుగుతుందో, రోజూ ఓ గంట సైకిల్ తొక్కినా అదే విధం గా కొవ్వు కరుగుతుందని వారు అంటున్నారు. స్థూలకాయం తో బాధపడుతున్న 130 మంది పై పరిశోధన చేసి మరి ఈ విషయాన్ని గుర్తించామన్నారు . ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ సైకిల్ తీసుకొని హ్యాపిగా సైకిలింగ్ చేయండి అప్పుడు వ్యాయామం చేయడం లేదు బరువు పెరిగిపోతున్నాం అన్న బెంగే ఉండదు.