NewsOrbit
హెల్త్

సహజంగా ఏడవడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకోండి

బాధగా ఉన్నపుడు విచారంలో కన్నీళ్లు రావడం సహజం. సంతోషంగా ఎక్కువైనా కూడా మనకు కన్నీళ్లు వస్తుంటాయి. వీటిని ఆనంద భాష్పాలు అంటారన్న విషయం తెలిసిందే. సహజంగా భావోద్వేగాలను అధిగమించడంలో విఫలమైనప్పుడు ఆబాధ కన్నీళ్ల రూపంలో బయటకు వస్తుంటాయి. ఇలా కాకుండా కంటిలో ఏమైనా పడ్డప్పుడు,కంటి సమస్యల వల్ల కూడా కన్నీళ్లు వస్తుంటాయి. సహజంగా వచ్చే ఏడుపు వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

 

మీ మనస్సులోని భావోద్వేగాలు బయటకు వచ్చినప్పుడు కన్నీళ్లు వస్తుంటాయి. అవి ముఖ్యంగా మీ శరీరంలోని ఒత్తిడిని తగ్గిస్తాయి. అంతే కాదు మీలోపల ఉండే ఆందోళన, గందరగోళ స్థితిని తగ్గిందుకు కృషి చేస్తాయి కన్నీళ్లు. వీటి అనంతరం మీలో నెమ్మది వాతావరణం కలిగి సాధారణ స్థితికి తీసుకువచ్చేలా కృషి చేస్తాయి. కన్నీళ్ల వల్ల కంటిలోని కొన్ని విషపూరిత అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉందని శాస్త్రపరంగా తేలింది. ఇవి శరీరంలోని ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఈ ఒత్తిడి హార్మోన్ల వల్ల శరీరంలో జరిగే మార్పుల నుండి రక్షిస్తుంది. ప్రతి ఒక్కరి కన్నీళ్లలో లైసోజైమ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇందులో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు నలతలను, కంటికి వచ్చే సమాజ ఇన్ఫెక్షన్లను సహజంగా తొలగించేందుకు కృషి చేస్తాయి.

కొందరు పొడి కళ్ళ సమస్యతో చాలా బాధపడుతుంటారు. ఇలాంటి సమస్యకు సహజ చికిత్స ఇది. సహజంగా వచ్చే కన్నీళ్ళ వల్ల కళ్ళ పొడిదనం తగ్గిపోవడమే కాకుండా, ఎరుపు మారడం మరియు దురదను నివారించే అవకాశం ఉంది. మరి ఎక్కువ ఐతే వైద్యున్ని తప్పక సంప్రదించండి. బాధతో వచ్చే ఏడుపు ద్వారా మెదడులో ఉత్పత్తి అయ్యే మంచి ఎమోషన్ హార్మోన్లు మనస్సును చాల తేలికపరచడమే కాకుండా మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఏడుపు ప్రతికూల భావోద్వేగాల నుండి ఉపశమనం కలిగిస్తుందని వైద్యులు భావిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఏడుపువస్తే ఏడవండి అది ఆరోగ్యానికి మంచిది.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri