బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన స్టార్ కంటెస్టెంట్ సయ్యద్ సోహెల్ కు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. అతనికి పట్టినట్లు అదృష్టం ఆ ఇంటిలో ఉన్న ఎవరికీ పట్టలేదు అని చెప్పాలి. దాదాపు విన్నర్ తో సమానంగా రెమ్యూనరేషన్ సాధించాడు. సినిమాలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఎన్నో ఆఫర్లు తలుపు తడుతున్నాయి. తాజాగా తన చెల్లి పెళ్లి కూడా ఘనంగా చేశాడు.
కల్లాకపటం లేని మనసు…. ఏ ఎమోషన్ దాచుకోలేని తత్వం, స్నేహానికి ఇచ్చే ఇంపార్టెన్స్ సోహెల్ ను ఈ స్థాయిలో నిలబెట్టాయి అని అతని ప్రేక్షకులు చెబుతూ ఉంటారు. ఇక హిస్టరీ లోనే 25 లక్షల రూపాయలు టైటిల్ గెలవకుండా సంపాదించిన మొదటి కంటెస్టెంట్ గా సోహెల్ నిలిచాడు. బయటికి వచ్చిన సోహ్లె ఇంటర్వ్యూలతో పూర్తి బిజీ అయిపోయాడు.
ఆదివారం తన సొంత ఊరికి వెళ్ళిన సోహెల్ అక్కడ తన సోదరి పెళ్లి లో ఫుల్ జోష్ తో ఎంజాయ్ చేశాడు. అతనితో పాటు అతని స్నేహితుడు మెహబూబ్ దిల్ సే కూడా అక్కడే ఉన్నాడు. అలాంటి సమయంలో అందరూ అతనితో ఫోటోలు దిగుతున్నారు. సోహెల్ అతని బావతో కూడా ఫోటో దిగుతున్న ఈ సమయంలో ఒక ఊహించని సంఘటన జరిగింది.
తన క్లోజ్ ఫ్రెండ్ అఖిల్ సార్థక్ అక్కడికి సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో పెళ్లి కి రావడం కుదరదు అని చెప్పిన అఖిల్ ఒక్కసారిగా స్టేజ్ పైకి వచ్చేశాడు. ‘మెహబూబ్, అందరూ షాక్ అయిపోయారు. ‘దొంగ రాను అని చెప్పి ఇలా వచ్చేస్తావా’ అని అఖిల్ తో అన్నారు. ఈ వీడియో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది.