సీజన్ ఫోర్ బిగ్ బాస్ టైటిల్ కైవసం చేసుకున్న కంటెస్టెంట్ అభిజిత్ బయట పెద్దగా హడావుడి చేయడం లేదు. ఇతర కంటెస్టెంట్ లు గెలవక పోయినా గాని ఇంటర్వ్యూ ల మీద ఇంటర్వ్యూ ఇస్తూ చాలా షోలలో పాల్గొంటున్నారు. కానీ అభివృద్ధి మాత్రం బిగ్ బాస్ హౌస్ లో వ్యవహరించిన తీరు మాదిరిగానే స్లో అండ్ స్టడీ అన్నట్టుగా రాణిస్తున్నారు.
మేటర్ లోకి వెళ్తే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన చాలామంది కంటెస్టెంట్ లు సినిమా ప్రాజెక్టు లు ఒప్పుకుంటూ అధికారిక ప్రకటన కూడా చేసేస్తున్నారు. కానీ సినీ కెరీర్ విషయంలో అభిజిత్ ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. ఇప్పటివరకు అభిజిత్ ఏ ఒక్క సినిమాకు అధికారికంగా ఓకే చెప్పలేదు. మరోపక్క వెబ్ సిరీస్ లలో కూడా ఆఫర్లు వస్తున్నా వాటిని పక్కనపెట్టి సోలో హీరోగా ముందు తనను తాను ప్రూవ్ చేసుకోవాలని ఆ స్టోరీ కోసం వెయిట్ చేస్తున్నాడు అంట.
అందుకే ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకోవడానికి అభిజిత్ ఇంట్రెస్ట్ చూపించడం లేదని ఇండస్ట్రీ లో టాక్ నడుస్తుంది. ఈ క్రమంలో సన్నిహితులతో అదే విధంగా కుటుంబ సభ్యులతో చర్చించి సోలో హీరో అయితేనే బాగుంటుందన్న అభిప్రాయం కి వచ్చి ఆ స్టోరీ కోసం వెయిట్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. బిగ్ బాస్ హౌస్ లో వచ్చిన క్రేజ్ ఆధారం చేసుకుని ఏదో రెండు మూడు సినిమాలు చేసుకుని హడావిడి చేయడం కంటే వచ్చిన క్రేజ్ ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని అభి డిసైడ్ అయినట్లు టాక్.