చిగుళ్ల వెంట రక్తం కారడం చాలా సహజం. కొందరిలో ఇది చాలా తరచుగా జరగవచ్చు. అయినా భయపడాల్సిన పని లేదు. ఎక్కువ సందర్భాల్లో ఈ సమస్యను ఇంట్లోనే పరిష్కరించుకోవచ్చు.
దంతావధానం తర్వాతనో, ఫ్లోసింగ్ చేసిన తర్వాతనో చిగుళ్ల వెంట రక్తం కారడం కనబడుతుంది. దీనికి ప్రధానమైన కారణం పళ్లపై పాచి పేరుకుపోవడం, లేదా పెంకు కట్టడం. ఇది బాక్టీరియా ఇన్ఫెక్షన్కు దారి తీసి అక్కడి చిగుళ్లను పాడు చేస్తుంది. తద్వారా చిగుళ్ల వెంట రక్తం కారడం జరుగుతుంది.
రక్తం కారడానికి ప్రధాన కారణాలు:
- పళ్లు సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం.
- మరీ గట్టిగా ఉన్న బ్రష్ వాడడం.
- వాడీవాడీ పనికిరాకుండా పోయిన బ్రష్‌ను ఇంకా వాడడం.
- ఫ్లాసింగ్ మరీ మొరటుగా చేసుకోవడం.
- యాస్ప్రిన్, ఐబుప్రొఫెన్ వంటి మందులు, బ్లడ్ థిన్నర్స్ వాడడం.
- జింజివైటిస్ వ్యాధి మొదలుకావడం.
వీటిలో జింజివైటిస్ అయితే వైద్యుడి దగ్గరకు వెళ్లి చికిత్స తీసుకోవాలి. చిగుళ్ల వెంట రక్తం కారుతున్నపుడు ఏ విధంగా ఆపాలో కింద చూడండి:
- బాండేజి క్లాత్‌తో రక్తం కారుతున్న చోట నెమ్మదిగా అదిమి ఉంచండి.
- ఐస్‌ను గుడ్డలో ఉంచి రక్తం కారుతున్న చోట అదమండి.
- క్లోరోహెక్సిడైన్, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి యాంటీ బాక్టీరియల్ మౌత్‌వాష్ ప్రయత్నించండి.
- ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటితో పలుసార్లు పుక్కిలించండి.
- పసుపు ముద్దగా చేసి రక్తం కారుతున్న చోట అద్ది పట్టుకోండి.
పైన పేర్కొన్న పద్ధతుల్లో పది నిముషాలు ప్రయత్నించినా రక్తం కారడం ఆగకపోతే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
Disclaimer: This content and media is created and published online for informational purposes only. It is not intended to be a substitute for professional medical advice and should not be relied on as health or personal advice.