NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Madanapalle : మదనపల్లె ఘటనలో కోట్ల విలువైన ఆస్తి కోణం?జంట హత్యల వెనుక పెద్ద స్కెచ్??

Madanapalle : చిత్తూరు జిల్లా మదనపల్లి అక్కాచెల్లెళ్ల హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇంకా మిస్టరీ వీడలేదు.

Big sketch behind madanapalle twin murders ??
Big sketch behind madanapalle twin murders ??

కన్నకూతుళ్లను తల్లిదండ్రులు ఎందుకు అతి కిరాతకంగా చంపారు అనేది తెలియాల్సి ఉంది. తల్లిదండ్రుల మూఢభక్తే ఈ దారుణానికి కారణం అనే వాదనలు వినిపిస్తున్నా.. ఇంకా ఏదో జరిగిందనే అనుమానాలు లేకపోలేదు. పురుషోత్తం, పద్మజ దంపతుల పేరుతో ఉన్న కోట్ల విలువ చేసే ఆస్తుల కోసం కుట్ర జరిగిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.జంట హత్యల మిస్టరీ రోజులో కొత్త కోణానికి దారితీస్తోంది. ఇప్పటి వరకు అలేఖ్య, సాయి దివ్య ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అంశాలను కేంద్రంగా చేసుకుని కొత్త కోణాలు, విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో కొత్త కోణంలో ఈ హత్యలకు సంబంధించి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Madanapalleఆస్తులపై కన్నేసి హత్యలకు ప్రేరేపించారా?

ఈ హత్యల వెనుక వేల కోట్ల కుట్రకోణం దాగి ఉందన్న అనుమానాలు తలెత్తున్నాయి.పురుష్తోతం, పద్మజ దంపతులు మదనపల్లి సబ్ జైలులో ఉన్నపుడు హైకోర్టు న్యాయవాది రజని పురుషోత్తమ నాయుడును కలిసి మాట్లాడారు. జంట హత్యల నిందితులను ఎవరో ప్రేరేపించారని ఆమె తెలిపారు. సుప్రీంకోర్టులో దిశ కేసు వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కృష్ణమాచారి సూచనల మేరకు రజని పురుషోత్తంను జైలులో కలిశారు.
ఈ హత్యలకు ప్రేరేపించింది మాత్రం వేరే వ్యక్తులు కచ్చితంగా ఉండి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పురుషోత్తం నాయుడు, పద్మజ దంపతులకు కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తులను కాజేసేందుకు కూడా ఇలాంటి పన్నాగాలు, కుట్రలు జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ కుటుంబానికి చిత్తూరు, చెన్నై, బెంగళూరు ప్రాంతాల్లో విలువైన ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.

విశాఖ మానసిక వైద్యశాలకు నిందితులు!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనలో పురుషోత్తం దంపతులను అరెస్టు చేసిన పోలీసులు వారిని మదనపల్లె సబ్‌జైలుకు తరలించారు. వారి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో తిరుపతి రుయాకు తరలించారు. అక్కడ వారిని పరీక్షించిన డాక్టర్లు ఆ ఇద్దరికి కస్టోడియన్‌ కేర్‌ కావాలని సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో జైలు వాతావరణంలోనే చికిత్స అందించేందుకు వీలుగా సరైన వ్యవస్థ ఉండాలన్నారు. జైలులో అలాంటి వసతులు లేనందునే విశాఖలోని కస్టోడియన్‌ కేర్‌కు నిందితులను తరలించాలని సిఫార్సు చేసినట్లు రుయా డాక్టర్లు తెలిపారు.దీంతో జంట హత్యల కేసులో నిందితులైన పురుషోత్తం, పద్మజ దంపతులను బుధవారం మదనపల్లి సబ్ జైలు నుంచి విశాఖలోని ప్రభుత్వ మానసిక వైద్యశాలకు పోలీసులు తరలించారు. మదనపల్లె సబ్ జైలులో పద్మజ మానసిక స్థితి చాలా విచిత్రంగా ఉన్నింది. పగలు నిశ్శబ్దంగానే ఉండే పద్మజ…రాత్రి అయ్యేసరికి రెచ్చిపోయేది. శివ..శివ అంటూ గట్టిగా అరుపులు, కేకలు వేసేంది. ఆమె తీరుతో తోటి ఖైదీలు భయాందోళన చెందారు. నిద్రలేని రాత్రులు గడిపారు. పద్మజ భర్త పురుషోత్తం మాత్రం సబ్ జైల్లో నిత్యం ఏడుస్తూ కనిపించారని పోలీసులు తెలిపారు. మొత్తం మీద మదనపల్లి ఘటన మిస్టరీ గా మారింది.

 

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?