Pawan Kalyan : తెలుగు సినీ ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దమ్మున్న డైరెక్టర్ అనే పదం ఇతనిని చూసి పుట్టిందేమో అన్నట్లు అనిపిస్తుంది. తన కెరీర్ తొలినాళ్లలో పూరి సృష్టించిన ప్రభంజనం అలాంటిది మరి. చిన్న, పెద్ద హీరోలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి భారీ హిట్లు ఇచ్చేసాడు. ఇక మహేష్ బాబుకి అయితే పోకిరి, బిజినెస్ మెన్ లాంటి రెండు కల్ట్ సినిమాలను ఇచ్చిన పూరి తర్వాత మహేష్ కోసం ‘జనగణమన’ అనే మరొక కథను తయారు చేసుకున్నాడు.
అయితే ఆ కథపై మహేష్ అంతగా ఆసక్తి చూపకపోవడంతో అది కాస్తా పెండింగ్లో పడింది. ఆ తర్వాత కే జి ఎఫ్ హీరో యశ్ తో ఈ సినిమా చేసేందుకు పూరి సన్నాహాలు చేశారు కానీ అది కూడా ఒక కొలిక్కి రాలేదు. దీంతో ఇక ఈ సినిమా స్టోరీ అటకెక్కడం ఖాయం అని అందరూ అనుకుంటున్న సమయంలో పూరి జగన్నాథ్ మాత్రం పట్టు వదలలేదు. ఈ కథను పవన్ కళ్యాణ్ దగ్గరకు తీసుకు వెళ్లారట. పవన్ కూడా తను ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి ఒక కథ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.
పవన్ ఈ కథ పై పాజిటివ్ గా ఉండటం తో అతనికి తగ్గట్లు కథలో చిన్న చిన్న మార్పులు చేయడానికి కూడా పూరి జగన్నాథ్ రెడీ అయ్యాడు అని సమాచారం. ఈ విషయమై ఇప్పటికే పవన్ కళ్యాణ్, పూరి జగన్నాథ్ కలుసుకున్నారట. వచ్చే ఎన్నికలకు ముందు ఒక సందేశాత్మక చిత్రం చేయాలని భావిస్తున్నాడు. అందుకే ‘జనగణమన’ ను వర్తమాన రాజకీయాలకు అనుగుణంగా మార్చి తనదైన స్టైల్ లో పవర్ ఫుల్ డైలాగ్స్ తో చూపిస్తే బాగుంటుందని పవన్ పూరి జగన్నాథ్ సూచించినట్లు తెలుస్తోంది.
అదే ఆలోచనతో పూరి కూడా ఉన్నట్లు పవన్ కు తగ్గట్లు మారుస్తారని వార్తలు వస్తున్నాయి. ఇక ఎలక్షన్ లోపల వీలైనన్ని సినిమాలు చేయాలని పవర్ స్టార్ అనుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న పవన్ లైన్ లో దాదాపు ఐదు సినిమాలు ఉన్నాయి. ఇక ఇవన్నీ పూర్తి కావడానికి వచ్చే ఏడాది వేసవి వరకు సమయం పడుతుంది. ఆ తర్వాత ‘జనగణమన’ నే అని ఇండస్ట్రీ టాక్. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమాలు థియేటర్ దగ్గర భారీ ఇంపాక్ట్ చూపించాయి. పవన్ కి ‘బద్రి’ సినిమాతో పూరి కెరీర్ కి భారీ బూస్ట్ ఇచ్చాడు అని చెప్పాలి. మరి తన పొలిటికల్ కెరీర్ కు ఇప్పుడు ‘జనగణమన’ ఏ మాత్రం ఉపయోగపడుతుందో చూడాలి.