NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Nandamuri : బాలయ్య సరికొత్త పోలిటికల్ బాంబ్ – చంద్రబాబు కి కంగారు మొదలైంది ?

Nandamuri : రాష్ట్రంలో స్థానిక పంచాయతీ పోరు రసవత్తరంగా సాగుతోంది, ఇప్పటి వరకూ గ్రామ పంచాయతీ ఎన్నికల రెండు విడతల పోలింగ్ పూర్తి అయ్యింది. మెజార్టీ స్థానాలు వైసీపీ బలపర్చిన అభ్యర్థులే విజయం సాధించారు. ఏకగ్రీవాలు కూడా బాగానే అయ్యాయి. అయితే రాజకీయాలపై అంటీ ముట్టనట్లుగా ఉంటే ప్రముఖ సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇప్పుడు పంచాయతీ ఎన్నికలను సీరియస్ గా తీసుకుని తన నియోజకవర్గంలో పర్యటించడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. హిందూపురం నియోజకవర్గం నుండి రెండవ సారి ఎమ్మెల్యేగా ఎన్నికైనా బాలకృష్ణ అసెంబ్లీ సమావేశాల్లోనూ పెద్దగా యాక్టివ్ గా ఉన్నది లేదు. అడపా దడపా నియోజకవర్గంలో పర్యటిస్తూ సినీ రంగానికే ఎక్కువగా టైమ్ కేటాయిస్తూ వస్తున్నారు. అధికార పార్టీపైగానీ, సీఎం వైఎస్ జగన్ ను గానీ పెద్దగా విమర్శించిన దాఖలాలు లేవు. అయితే గత కొద్ది రోజులుగా రాజకీయాలపై ఎక్కువగా దృష్టి  పెడుతున్నట్లు కనబడుతోంది.

Nandamuri : Balakrishnan serious comments
Nandamuri : Balakrishnan serious comments

పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని బాలకృష్ణ రెండు రోజుల పర్యటన నిమిత్తం హిందూపురంకు చేరుకున్నారు. నిన్న, ఈ రోజు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. టీడీపీ మద్దతుదారుల గెలుపే లక్ష్యంగా ఈ సమావేశాలను నిర్వహించి దిశానిర్దేశం చేశారని అంటున్నారు. ఈ సందర్భంలోనే టీడీపీ బలపర్చిన ఓ అభ్యర్థి భార్యను వైసీపీ నేతలు బెదరించడంతో ఆత్మహత్యాయత్నంకు పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా బాలకృష్ణ ఆసుపత్రికి వెళ్ళి ఆమెను పరామర్శించారు. అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. వైసీపీని తీవ్ర స్థాయిలో విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ఆరాచకాలకు పాల్పడుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ శ్రేణులను బెదిరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

వైసీపీ ఆరాచాక సంస్కృతి వల్ల నష్టం కేవలం టీడీపీకే కాదు సమాజానికి ప్రమాదమని అన్నారు బాలకృష్ణ, బెదిరిస్తే బెదిరిపోవడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు ఇంతకు ఇంత బదులు తీర్చుకుని తీరతామంటూ వైసీపీ శ్రేణులను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు బాలకృష్ణ, అయితే బాలకృష్ణ పొలిటికల్ గా యాక్టివ్ కావడం క్యాడర్ కు కొంత ఉత్సాహాన్ని నింపుతున్నా మరో పక్క పార్టీ శ్రేణుల్లో, చంద్రబాబులో టెన్షన్ కూడా నెలకొంటుందని టాక్. బాలకృష్ణ సినిమాల్లో డైలాగ్ లు చెప్పడం వరకు ఓకే గానీ పబ్లిక్ సమావేశాల్లో వాయిస్ మీద కమాండ్ లేకపోవడం వల్ల ఏది పడితే అది మాట్లాడితే అవి వివాదాస్పదం అవుతాయని భయపడుతున్నారుట. ఇటీవల కూడా బాలకృష్ణ ఓ సందర్భంలో జగన్ పాలనను విమర్శిస్తూ ఇక నేను జనంలోకి వస్తానంటూ వ్యాఖ్యానించారు. బాలకృష్ణ రాజకీయ రంగంలో యాక్టివ్ అవ్వడం చంద్రబాబులో కలవరాన్ని కల్గిస్తుందని అంటున్నారు.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju