NewsOrbit
న్యూస్ రివ్యూలు

Drishyam 2 Movie Review : దృశ్యం 2 మూవీ రివ్యూ

Drishyam 2 Movie Review

Drishyam 2 Movie Review : దృశ్యం 2 మూవీ రివ్యూ

Drishyam 2 Review  : మోహన్ లాల్ హీరోగా మలయాళంలో వచ్చిన సూపర్ హిట్ థ్రిల్లర్దృశ్యంఆ తర్వాత ఎన్ని భాషల్లో రీమేక్ అయిందో అందరికీ తెలిసిందే. ప్రతిచోటా ఆ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అలాంటి మంచి సబ్జెక్ట్ కు సీక్వెల్ గా వచ్చినదృశ్యం 2′ ఈసారి థియేటర్స్లో కాకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ ఓటిటి లో రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం

Drishyam 2 Movie Review : పాజిటివ్ లు 

దృశ్యం మొదటి భాగంలో లాగానే రెండో భాగంలో కూడా మోహన్ లాల్ తన మాస్టర్ క్లాస్ పర్ఫార్మెన్స్ తో చితక్కొట్టాడు. సినిమా మొత్తం ఒకటే ఫ్లో లో ఉన్న మోహన్ లాల్ ఒక్కసారిగా హై మొమెంట్స్ వచ్చినప్పుడు కూడా చాలా సునాయాసంగా ఎమోషన్స్ పండించేశారు.

ఈ కథకు ప్రాణం అంటే చివరి 40 నిమిషాలు అనే చెప్పాలి. సినిమా మొత్తం బాగానే ఉంది కానీ ఏదో వెలితి. దృశ్యం రేంజ్లో ఉండదేమో అని అందరికీ అనుమానం ఉన్న సమయంలో ఒక్కసారిగా సినిమా లో వరుసగా కొన్ని సన్నివేశాలు ఈ సమయంలోనే చోటుచేసుకుంటాయి. అంతే…. ఈ సినిమాను తీసుకెళ్లి ఎక్కడో పెట్టేస్తాయి.

Drishyam 2 Movie Review
Drishyam 2 Movie Review

మధ్య మధ్యలో వచ్చే సస్పెన్స్ లు, ట్విస్ట్ లు కూడా ఆసక్తికరంగా సాగుతాయి. సగం భాగం నుండి సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా అక్కడక్కడ దర్శకుడు పెట్టిన థ్రిల్లింగ్ మూమెంట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి.

ఈ సినిమాలో క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అసలు ఎవరూ ఊహించని విధంగా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ చాలా బాగుంది. ఒకరకంగా ప్రేక్షకులకు పిచ్చెక్కించింది అనే చెప్పాలి. దీంతోపాటు విజువల్స్, మ్యూజిక్ కూడా టాప్ లెవల్ లో ఉన్నాయి.

Drishyam 2 Review : నెగటివ్ లు

సినిమా మొదటి భాగంలో పెద్దగా చెప్పుకోదగ్గ అంశాలు ఏమీ లేకపోవడమే ఒక మైనస్ పాయింట్. ఆల్రెడీ మనందరికీ తెలిసిన క్యారెక్టర్లేపైగా మొదటి భాగంలో ఏం జరిగిందో కూడా తెలిసినప్పుడు సినిమా ఫస్ట్ హాఫ్ మరింత సాగదీయడం అనేది ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చదు.

ఈ సినిమాలో నరేషన్ చాలా స్లోగా ఉంటుంది. మొదటి భాగం తో పోలిస్తే కథ సాగే వేగం చాలా తక్కువ. ఓటిటి రిలీజ్ లో ఎడిటర్ కి రన్ టైమ్ విషయంలో చాలా సౌలభ్యతలు ఉంటాయి కానీ ఇక్కడ ఎందుకో ఆ స్వాతంత్ర్యం తీసుకోలేదు.

అన్నింటికన్నా సినిమా అయిపోయిన తర్వాత ప్రేక్షకుడికి వచ్చే ఫీలింగ్ఇంత మంచి సబ్జెక్ట్, స్టోరీలైన్ పెట్టుకొని కథలోకి ఎందుకు అంత లేటు గా తీసుకు వెళ్లారు అని. స్క్రీన్ప్లే పరంగా కూడా మెల్లగా కథ లోకి ఎప్పుడో తీసుకొని వెళ్ళడం అనేది ఆమోదయోగ్యం అయితే కాదు అనిపిస్తుంది.

Drishyam 2 Movie Review : దృశ్యం 2 కథ

దృశ్యం మొదటి భాగం కథ ఎక్కడ ముగిసిందో రెండవ భాగం అక్కడి నుండి మొదలవుతుంది. గతంలో వరుణ్ మర్డర్ కేసులో సరైన ఆధారలు లేకపోవడంతో జార్జి కుట్టి (మోహన్ లాల్) ఫ్యామిలీకి ఎటువంటి శిక్ష పడదు. అది జరిగిన ఆరు సంవత్సరాల తర్వాత రెండో భాగం మొదలవుతుంది. ఎప్పట్టిలాగే జార్జి కుట్టి తన ఫ్యామిలీతో సంతోషంగా తన జీవితాన్ని గడుపుతుంటాడు. కానీ పోలీసులు మాత్రం సీక్రెట్ గా వరుణ్ కేసుని డీల్ చేస్తూ జార్జి ఫ్యామిలీని ఒక కంట కనిపెడుతూనే ఉన్నారు. చివరికి చూస్తే పోలీసులు ఎలాగో వరుణ్ శవాన్ని కనిపెట్టి జార్జిని అరెస్ట్ చేస్తారు. ఇలా అరెస్టయిన జార్జి కుట్టి పైన కోర్టులో నేరం రుజువైందా? లేకపోతే మళ్లీ తన ఫ్యామిలీని కాపాడుకునేలా జార్జి ఏదైనా ప్లాన్ వేసాడా? అనేది కథ.

Drishyam 2 Review : విశ్లేషణ 

దేశవ్యాప్తంగా ఎంతో ప్రజాదరణ ప్రాచుర్యం పొందిన బ్లాక్బస్టర్దృశ్యంసినిమా కి సీక్వెల్ తీయడం అంటే నిజంగా చాలా డేరింగ్ స్టెప్. ఎందుకంటే ఆ సినిమా క్రియేట్ చేసినా మ్యాజిక్ అంతా ఇంతా కాదు. అయితే దృశ్యం 2 సినిమా స్టోరీలైన్ కూడా అద్దిరిపోయింది. దృశ్యం 2 రెండవ అర్థభాగం నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. మొదటి భాగం విపరీతంగా బోర్ కొట్టినా చివరి 40 నిమిషాల్లో కి వచ్చేసరికి ఆ ఫీలింగ్ అంతా ప్రేక్షకులు మరిచిపోతారు. వరుసగా ఎమోషన్స్ తో ఉక్కిరిబిక్కిరి అయిపోతారు. థియేటర్లో గనుక ఈ బొమ్మ పడుంటే బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ చూసేది. అంతేకాకుండా చివరి 40 నిమిషాలు విజిల్స్ తో థియేటర్లు నిండిపోయాయి.

ఇంతకీ చూడొచ్చు? – భేషుగ్గా….

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju