NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila : అన్న జగన్ తోనూ ఢీ అనడానికి వెనకాడనంటున్న షర్మిల..??

YS Sharmila : తెలంగాణలో రాజకీయ పార్టీ ప్రారంభించేందుకు గ్రౌండ్ వర్క్ చేస్తున్న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తాను పార్టీ పెట్టడం తన అన్న ఏపి సీఎం వైఎస్ జగన్‌కు ఇష్టం లేదని అన్నారు. జగన్ తో తనకు పార్టీ పరమైన విభేదాలు మాత్రమేనని అన్నారు. తనకు వైసీపీలో ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదో జగన్ నే అడిగి తెలుసుకోవాలని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం జగన్ ‌ను ఎదిరించడానికి కూడా తాను సిద్ధమేనని షర్మిల స్పష్టం చేశారు.

YS Sharmila sensational comments
YS Sharmila sensational comments

YS Sharmila : స్థానికతను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు

షర్మిల పార్టీ పెట్టనున్నారు అన్న ప్రచారం జరిగిన నాటి నుండి   ప్రతిపక్షాలు ఆమె స్థానికతపై విమర్శలు చేస్తున్నాయి. దీనిపై షర్మిల క్లారిటీ ఇచ్చారు. ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే పిల్లలనూ కన్నాను, ముమ్మాటికీ తెలంగాణ బిడ్డనే అని అంటూ సీఎం కెసిఆర్, బీజెపీ నేత విజయశాంతి ఎక్కడ పుట్టారు అని షర్మిల ప్రశ్నించారు. హైదరాబాదుతో తనకు విడదీయరాని అనుబంధం ఉందనీ, తన స్థానికతను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని అన్నారు. దివంగత సీఎం జయలలిత ఎక్కడ పుట్టి, ఎక్కడ సీఎం అయ్యారో అందరికీ తెలుసునని అన్నారు. లోటస్ పాండ్ లోని తన నివాసం నుండే పార్టీ ప్రస్థానం ప్రారంభిస్తానని షర్మిల పేర్కొన్నారు.

టిఆర్ఎస్, బీజేపీపై సెటైర్ లు

తెలంగాణ అభివృద్ధిపై ఎవరికీ చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఉద్యమం అంటూ ఒకరు, మతం అంటూ మరొకరు మాట్లాడుతున్నారని టీఆర్ఎస్, బీజెపీలను ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు. అతి త్వరలోనే పార్టీ ప్రకటన ఉంటుందని షర్మిల అన్నారు. రాష్ట్రంలో ఆరోగ్య శ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశారని విమర్శించిన షర్మిల.. సీఎం కేసిఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారని అన్నారు. గొర్రెలు, బర్రెలు ఇవ్వడం కన్నా ఉద్యోగాలపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదని పేర్కొన్నారు. కరోనా రోగుల నుండి ప్రైవేటు ఆసుపత్రులు లక్షలు వసూలు చేసినా అసుపత్రుల దోపిడీపై సీఎం దృష్టి పెట్టలేదని విమర్శించారు.

త్వరలో పాదయాత్ర

రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకువచ్చే లక్ష్యంలో భాగంగా త్వరలో తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నట్లు షర్మిల తెలిపారు. పోలవరం నుండి పోతిరెడ్డిపాడు వరకూ తెలంగాణ ప్రయోజనాలే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీపై భర్త అనిల్ పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయన్న షర్మిల..తన తల్లి విజయమ్మ సంపూర్ణ మద్దతు ఉన్నట్లు తెలిపారు. తాను ఎవరో వదిలిన బాణం కాదని అన్నారు.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju