ఆర్ ఆర్ ఆర్‌లో స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు ట్రాన్స్ఫర్మేషన్ క్యారెక్టర్లో నటిస్తున్న మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ అసలు ఆర్ ఆర్ ఆర్ ఎలా రూపొందింది అనే విషయాన్ని వివరించారు. పాత్రికేయులతో రాంచరణ్ మాట్లాడుతూ “నేను రియాలిటీలో లేను. ఇది నిజమా? కాదా? అని అప్పుడప్పుడూ అనిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌లో పార్ట్ కావడం చాలా హ్యాపీగా ఉంది. ఎప్పటి నుండో రాజమౌళిగారితో పనిచేయాలని అనుకోవడం.. నాకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్, దగ్గరైన వ్యక్తి, చాలా చాలా నచ్చే వ్యక్తి తారక్‌తో, మాకు బాగా తెలిసిన దానయ్యగారితో పనిచేయడం ఆనందంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయ్యిందో చెప్పాలని నాకు ఆసక్తిగా ఉంది. కొన్ని నెలలు క్రితం నేను ఎయిర్‌పోర్ట్‌కు వెళుతున్నప్పుడు.. ఆయన ఇళ్లు మధ్య దారిలోనే. వచ్చే దారిలో అలా క్యాజువల్‌గా వచ్చేసి వెళ్లు అన్నారు. వెళ్లాను. లోపలికి వెళ్లగానే తారక్ నేలమీద మంచి ఫోజులో అలా ఉండటాన్ని చూసి తనేంటి ఇక్కడున్నాడు అనుకున్నాను. అదేంటి బ్రో నువ్విక్కడ అని తారక్ అడిగాడు. నువ్వేం చేస్తున్నావ్ అని అడిగాను. తారక్ ఈలోపు మీరేమైనా మాట్లాడుకోవాలా రాజమౌళిగారు నేను.. బయటకు వెళతాను అన్నారు. కానీ నేను.. నా ఫ్లైట్‌కి ఇంకా టైముంది మీరేమైనా మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోండి నేను వెయిట్ చేస్తాను అన్నాను. కొంత సేపు కన్ఫ్యూజన్లో ఉంచి.. మమ్మల్ని లోపలికి తీసుకెళ్లి ఆయన ప్రాజెక్ట్‌ని అనౌన్స్ చేశారు. మా ఇద్దరికీ చాలా ఆనందమేసింది. కచ్చితంగా మాకు ఇద్దరికీ ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది ఇద్దరం ఒకేసారి చెప్పాం. ఆ సంఘటన నా జీవితంలో మరచిపోలేని సంఘటన. నేను తారక్‌తో వర్క్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. మా ఇద్దరి షెడ్యూల్స్ ఇంకా గట్టిగా స్టార్ట్ కాలేదు. నేను నా బద్రర్ తారక్‌తో పనిచేయడానికి ఎదురు చూస్తున్నాను“ అన్నారు.
previous post
next post