NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

YS Jagan : ఒకేరోజు రెండు దెబ్బలు..! ఈ నష్టం ఏపీకే..! డ్యామేజి వైసీపీకా..!?

YS Jagan : Two Big Damages in Single Day YSRCP

YS jagan : ఏపీ అంటే ఆంధ్ర ప్రదేశ్ అనే కంటే “అనాధ ప్రదేశ్” అనడం మంచిదేమో. ఇక్కడి నాయకులను నాయకులు అనే కంటే “దద్దమ్మలు” అనడం మంచిదేమో. ఇక్కడి ప్రాజెక్టులను/ సమస్యలను “రాజకీయ వేదికలు” అనడం ఉత్తమమేమో… ఇలా చెప్పుకుంటూ వెళితే మమ్మల్ని జర్నలిస్టులు అనే కంటే “విమర్శకులు” అంటారేమో…! అందుకే ఇక మెయిన్ టాపిక్ కి వెళ్ళిపోతే ఆంధ్ర ప్రదేశ్ కి ఒకే రోజు రెండు దెబ్బలు తగిలాయి. యాధృచ్చికమో.., పర్యవసానమో ఏపీలోని రెండు కీలక అంశాలపైనా ఒకే రోజు కేంద్రం నుండి వైసీపీ ప్రభుత్వానికి మింగుడు పడని వార్తలు అందాయి. వాటి నష్టం మాత్రం కచ్చితంగా ఏపీకే. రాష్ట్రానికి, ప్రజలకు కచ్చితంగా నష్టమే. అయితే ఈ నష్టం వలన ఏర్పడే రాజకీయ ప్రభావం మాత్రం వైసీపికా..? కదా..? అనేది చెప్పుకోవాల్సిన అంశమే.

YS Jagan : Two Big Damages in Single Day YSRCP
YS Jagan : Two Big Damages in Single Day YSRCP

YS Jagan : పోలవరంపై అతి బెడిసికొట్టినట్టే..!?

పోలవరం ప్రాజెక్టు విషయంలో కావాల్సినంత ప్రచారం చేసుకోవచ్చు. అక్కడ ఏమి చేయకపోయినా చేసినట్టు, చూసినట్టు, సమీక్షించినట్టు వారం వారం ఫోటోలు, ప్రచారాలు చేసుకోవచ్చు. అచ్చం చంద్రబాబు లాగా..! అయితే జగన్ అంతకు మించిపోయారు. పోలవరం పనులు నెమ్మదించినా.., పనులకు ఆటంకాలు ఏర్పడుతున్నా.., కేంద్రం సహకరించకపోయినా.., ఏవేవో చెప్తూ బొమ్మలు చూపించారు. కేంద్రంతో పోరాడుతున్నట్టు.. తరచూ ఢిల్లీ వెళ్లి కేంద్రం హోమ్ మంత్రి అమిత్ షాని అడుగుతున్నట్టు బొమ్మలు వేసి, ఆర్భాటాలు చేశారు. కానీ చివరికి బెడిసి కొట్టింది. జనవరి 19 , ఫిబ్రవరి 19 న ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్ అమిత్ షాని కలిసి పోలవరం నిధులు అడిగారు అంటూ సీఎం కార్యాలయం నుండి ప్రెస్ నోట్ విడుదలయింది. కానీ నిన్న పార్లమెంటులో కేంద్రం జలశక్తి సహాయ మంత్రి మాట్లాడుతూ అసలు సీఎం జగన్, అమిత్ షా మధ్య పోలవరం టాపిక్ రాలేదని… జగన్ ఎటువంటి వినతి పత్రాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. దీంతో సీఎం కార్యాలయం, సాక్షి పత్రిక ప్రకటనలు అవాస్తవం అని తేలిపోయింది. ఈ దెబ్బ మామూలుగా లేదు..!

YS Jagan : Two Big Damages in Single Day YSRCP
YS Jagan : Two Big Damages in Single Day YSRCP

స్టీల్ ప్లాంట్ పై కేంద్రం పిడుగు.. వైసీపీకి వణుకు..!?

నిన్ననే… కేంద్రం వేసిన మరో పిడుగు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదు అని.. విశాఖలో ఉద్యమాలు జరుగుతున్నా.., పోరాటాలు ప్లానింగులు సాగుతున్నా… కేంద్రం వెనకడుగు వేయలేదు. ఆర్ధిక మంత్రి నిర్మలమ్మ చెప్పేసారు. సో.. ఈ దెబ్బ రాజకీయంగా బీజేపీకి తగలాలి అనుకుని లైట్ తీసుకోవాలన్నా… అక్కడ బీజేపీకి ఏమి లేదు. పది ఓట్లు ఉంటె.. అయ్యో పోతాయి అనుకోవచ్చు. కానీ బీజేపీకి అక్కడ ఏమి లేవు. అందుకే ఆ ప్రభావం కేంద్ర ప్రభుత్వంపై కాకుండా.. రాష్ట్ర ప్రభుత్వంపై ఎంతోకొంత పడనుంది. అధికారంలో ఉన్న సీఎం జగన్ కనీసం రాష్ట్ర మంత్రివర్గ తీర్మానం కూడా చేయకపోవడం.., అసెంబ్లీలో తీర్మానం చేయకపోవడం.., కేంద్రంతో ఎటువంటి చర్చలు జరపకపోవడం వంటివి విశాఖలో చర్చనీయాంశాలుగా ఉన్నాయి. సో.. ఇది రాజకీయంగా వైసీపీకి కొంత డ్యామేజీ చేసే అంశమే. రేపు మున్సిపల్ ఎన్నికలు పోలింగ్ ఉంది. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం వేడెక్కింది. నిన్న కేంద్రం నుండి ప్రకటన వచ్చేసింది. సో.. ఈ ఫలితం ఎలా ఉంటుందో అనే దిగులు వైసిపిలో మొదలయింది. దీన్ని కప్పిపుచ్చుకునేందుకు ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ… వాళ్ళను అక్కడి జనం పట్టించుకునే పరిస్థితి లేదు. కేవలం సీఎం జగన్ పైనే విశాఖ వాసులు నమ్మకంతో ఉన్నారు..! ఈ డ్యామేజీని కప్పిపుచ్చుకోవడానికి జగన్ ఏం ప్రయత్నాలు చేస్తారు..? అనేది కీలకంగా మారింది..!!

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju