NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

Jagan : జగన్ రాజకీయాల్లో రాకముందే తెలుసు అంటున్న లగడపాటి..!!

Jagan : జగన్ రాజకీయాల్లో రాకముందే తెలుసు అంటున్న లగడపాటి..!!

Jagan : ఏపీ సీఎం జగన్ Jagan పై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సంచలన కామెంట్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా రాణించిన లగడపాటి రాజగోపాల్.. విభజన జరిగిన తర్వాత సైలెంట్ అయిపోయిన సంగతి తెలిసిందే. రాష్ట్రం విడిపోయే పరిస్థితి ఉండదని ..అదే జరిగితే తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని అప్పట్లో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ప్రస్తుతం అదే రీతిలో రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఎలా ఉంటే సరిగ్గా ఎన్నికల సమయంలో సర్వే లు అంటూ వార్తల్లో నిలిచే లగడపాటి తాజాగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విజయవాడలో ఓటు హక్కును వినియోగించుకుని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ గురించి మాట్లాడుతూ..జగన్ రాజకీయాల్లోకి రాకముందు నుండి తనకు ఆయనతో పరిచయం ఉన్నట్లు స్పష్టం చేశారు.

Lagadapati sensational comments on jagan.
Lagadapati sensational comments on jagan.

జగన్ పాలన ఎలా ఉంది అన్నది మూడు సంవత్సరాల తర్వాత తెలుస్తుంది అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాజకీయ పార్టీల మధ్య పోటీ వాతావరణం ఎక్కువైపోయింది అందుకే ఓటర్లను ప్రజలను ఆకర్షించడానికి పార్టీలు సంక్షేమ పథకాల కు పెద్దపీట వేస్తున్నట్లు స్పష్టం చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సంక్షేమ మరియు అభివృద్ధి చాలా సమానంగా ఉండేవాణ్ణి పేర్కొన్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటాను అని గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు అదేవిధంగా రాజకీయ సర్వే లకు సైతం దూరంగా ఉంటున్నట్లు పేర్కొన్నారు. అంత మాత్రమే కాక రాష్ట్రంలో జరుగుతున్న ఆలయాలపై దాడుల విషయంలో పోలీసులు మరియు ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని ..దాడులకు గల కారణాలను గుర్తించాలని తెలిపారు. సార్వత్రిక ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ఓడిపోయినా గాని ..ఆయనను ప్రజలు ఆదరించటం నిజంగా హర్షించదగ్గ విషయం అని ప్రశంసించారు. ఎన్నికల్లో ఓడిపోయినా గాని స్థానిక ఎన్నికల్లో అవేమీ పట్టించుకోకుండా పోటీకి దిగడం అభినందనీయమని పేర్కొన్నారు.

 

 

Related posts

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N