NewsOrbit
బిగ్ స్టోరీ సినిమా

King Kong : హీరోలకే కాదు.. కింగ్ కాంగ్ కూ అభిమాన సంఘాలు..! ధియేటర్ల వద్ద బ్యానర్లు

fans banner for kong in telugu states

King Kong : కింగ్ కాంగ్ King Kong: సినిమాల్లో హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు. వీరిలో అభిమానులు, వీరాభిమానులు ఉంటారు. అభిమానులు సినిమా చూసి ఆనందిస్తే.. వీరాభిమానులు ఓపెనింగ్ షో హడావిడి, బ్యానర్లు, కటౌట్లు కట్టడం, పాలాభిషేకాలు, దండలు వేయడం, ధియేటర్లను అలంకరించడం, హీరో ఎంట్రీ ఇవ్వగానే తెరపై పువ్వులు, డబ్బులు విసరడం, హారతులు పట్టడం.. ఇలాంటివి గతంలో జరిగాయి.. ఇప్పుడూ జరుగుతున్నాయి. ఆయా హీరోలపై ఉండే అభిమానం అది. ఈ క్రమంలో హీరోలకు, హీరోయిన్లకు, దర్శకులకుకూడా బ్యానర్లు, కట్టడం చూశాం కానీ.. జంతువులకు కూడా బ్యానర్లు కట్టడం అభిమానులుగా చెప్పుకోవడం.. ఎప్పుడూ వినుండం.. చూసుండం. కానీ.. అటువంటి అరుదైన ఘట్టం విజయవాడ, వరంగల్ లో జరిగింది.

fans banner forKing Kong in telugu states
fans banner for King Kong in telugu states

 

ఈ బుధవారం ప్రపంచవ్యాప్తంగా ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ సినిమా విడుదలైంది. తెలుగులో కూడా రిలీజ్ చేశారు. విజయవాడలోని నవరంగ్ ధియేటర్ వద్ద కాంగ్ యూత్ ఫోర్స్ పేరుతో వెలసిన ఈ పోస్టర్ పై అభిమానుల పేర్లు కూడా ఉన్నాయి. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ సినిమాకు విచ్చేయుచున్న అభిమానులకు స్వాగతం అంటూ పేర్కొన్నారు. కింగ్ కాంగ్ అభిమానులకు, ధియేటర్ యాజమాన్యానికి శుభాకాంక్షలు అని కూడా పేర్కొన్నారు. వరంగల్ లో కూడా ఇదే తరహాలో ‘వరంగల్ కాంగ్ అభిమానుల సంఘం’ అనే బ్యానర్ వెలిసింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. గతంలో విజయవాడలో జాకీచాన్ కు కూడా అభిమాన సంఘం ఉండేది.

90ల్లో జాకీచాన్ సినిమాలు విడుదలైతే విజయవాడ జాకీచాన్ ఫ్యాన్స్ అని బ్యానర్లు వెలిసేవి. సినిమా పరిశ్రమ ఉన్నది హైదరాబాద్ లోనే అయినా.. సినిమాకు రాజధాని మాత్రం విజయవాడ అనే చెప్పాలి. ఇక్కడ సినీ అభిమానులు ఎక్కువ. సినిమాకు ఆదరణ ఎక్కువ. విజయవాడలో తొలి ఆట పడ్డాక వచ్చే టాక్ నిర్మాతలకు వేదం. ఎన్నో సినిమాలు సిల్వర్, గోల్డెన్, డైమండ్ జూబ్లీలు జరుపుకున్న నగరం. ఇలాంటి విజయవాడలో గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ సినిమాకు బ్యానర్లు కట్టారు కొందరు. ఈ సినిమాకు అభిమానులుగా పేర్కొన్నారు. ఈ బ్యానర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. కింగ్ కాంగ్ కు అభిమానులా.. అనేకంటే వారికి సినిమాపై ఉన్న అభిమానం ఇక్కడ ప్రముఖంగా నిలిచింది.

Related posts

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N