NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Cm Kcr: టెస్టుల విషయంలో కేసీఆర్ అలా చేసుంటే..!!

cm kcr health check up

Cm Kcr: సీఎం కేసీఆర్ Cm Kcr అంటే అభినవ ఉద్యమకారుడు. నేటి సమాజానికి ఉద్యమాన్ని ఎలా నడిపించాలో చూపిన వ్యక్తి. అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి. 13 ఏళ్ల నిరంతర పోరాటం.. వచ్చిన ఏ అవకాశాన్నీ వదలకుండా పోరాడి రాష్ట్రం సాధించి చరిత్ర సృష్టించారు. తెలంగాణ నినాదం ఆయన శ్వాసగా పోరాటం చేశారు. తెలంగాణ ప్రజల అభివృద్ధే తన ధ్యేయంగా పని చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటున్నారు. అయితే.. కరోనా సోకితే తెలంగాణ ప్రజలు ఏం చేయాలో గతేడాది చెప్పిన మాటలకు ఇప్పుడు ఆయన చేసినదానికి పొంతన లేదని చెప్పాలి.

cm kcr health check up
cm kcr health check up

గతేడాది.. ఇప్పుడు కూడా గాంధీ ఆసుపత్రిని కోవిడ్ ఆసుపత్రిగా మార్చారు. గాంధీ వైద్యులు శక్తికి మించి సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం సీఎంకు కరోనా సోకింది. ఆయనకు ఉన్న పరిమితుల దృష్ట్యా ఫామ్ హౌస్ లో చికిత్స తీసుకోవడమే కరెక్ట్. సామాన్యులకు ఎవరికీ ఇబ్బంది లేకుండా కట్టుదిట్టమైన భద్రత, సౌకర్యాల మధ్య ఇది సబబే. అయితే.. ముఖ్యమైన టెస్టుల కోసం ఆయన నిన్న యశోద ఆసుపత్రికి వెళ్లి టెస్టులు చేయించుకున్నారు. కానీ.. అవే టెస్టులు ప్రభుత్వాధినేతగా గాంధీలోనో, నిమ్స్ లోనో జరిపించి ఉంటే ప్రజల్లో మరింత భరోసా కల్పించినవారు అయ్యుండేవారని చెప్పాలి. యశోదలో చేసిన పకడ్బందీ ఏర్పాట్లే గాంధీ, నిమ్స్ లో చేయడం ప్రభుత్వానికి పెద్ద విషయం కాదు.

 

కానీ.. సాక్షాత్తూ సీఎం కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లారంటే గాంధీ, నిమ్స్ లో అటువంటి టెస్టులు, సౌకర్యాలు లేవని ప్రజలు భావించాలా? సామాన్యులెందరో వెళ్లలేని కార్పొరేట్ ఆసుపత్రులతో సమానంగా ప్రభుత్వాసుపత్రుల్లో సరైన వైద్య వసతులు లేవనా? ప్రభుత్వాసుపత్రుల్లో ఒకవేళ ఇటువంటి సౌకర్యాలు ఉన్నా.. సీఎంగా కేసీఆర్ ఇక్కడే టెస్టులు చేయించుకునుంటే ప్రభుత్వ ఖ్యాతి ఇంకా ఇనుమడింపయ్యేది. తెలంగాణ ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలు ఇంతగా చేపట్టాం, నిర్వహిస్తున్నాం, ప్రజలకు అందుబాటులో ఉన్నాయని ఇంకా గర్వంగా చెప్పుకునే అవకాశం కూడా ఉండేదని చెప్పాలి.

 

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju