NewsOrbit
న్యూస్

Sandalwood: శాండల్ వుడ్ నటి పైశాచికం..! తమ్ముడి తల మొండెం వేరు చేయించిన వైనం..!!

Sandalwood: కర్ణాటకలో ఈ నెల 12న జరిగిన దారుణ హత్య వెనక ఓ వర్ధమాన నటి ప్రమేయం వెలుగు చూసింది. తన ప్రేమకు అడ్డుగా ఉన్నాడని ప్రేమికుడితో కలిసి సోదరుడి హత్యకు ప్లాన్ చేసిందా నటి.కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు శుక్రవారం నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేయటంతో ఈవాస్తవం బయట పడింది.

Sandalwood actress cuts her brother head
Sandalwood actress cuts her brother head

అసలేం జరిగింది?

శాండల్ ఉడ్ లో అప్ కమింగ్ ఆర్టిస్ట్ షయన కాట్వే, నియాజ్ అనే వ్యక్తితో  ప్రేమలో పడింది. వీరి ప్రేమను ఆమె తమ్ముడు రాకేష్ తీవ్రంగా వ్యతిరేకించాడు. షయన  ఇటీవలే ఒకటి, రెండు కన్నడ సినిమాల్లో నటించింది. వీరి ప్రేమను షయన  సోదరుడు తరచూ వ్యతిరేకించటంతో, నియాజ్ తమ ప్రేమకు అడ్డుగా ఉన్నరాకేష్ ను అంత మొందిస్తానని షయన  వద్ద ప్రస్తావించాడు. అందుకు ఆమె అంగీకరించి ..నిజమే ఆ పని చేస్తే మన ప్రేమను అడ్డుకునే వారెవరూ ఉండరు అని ప్రోత్సహించింది.   ప్రేయసి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన నియాజ్ సమయం కోసం వేచి ఉన్నాడు.

దారుణంగా చంపేశారు!

ఈ నేపధ్యంలో ఈనెల 12న హబ్బళ్లి నగర శివారులోని దేవరహళ్లి లోని కంప చెట్లు, వ్యర్ధాలు పడేసే దిబ్బల దగ్గర తలకాయ లేని గుర్తు తెలియని మృతదేహాన్ని స్ధానికులు గమనించారు. ఆనోటా ఈ నోటా ఈ వార్త పోలీసులకు చేరింది.ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు తలకాయ లేని మొండాన్ని చూసి అవాక్కయ్యారు. దుండగులు యువకుడిని హత్యచేసి తల వేరు చేసి తీసుకు వెళ్ళారు. తలలేని మొండాన్ని ఆస్పత్రికి తరలించి.. గుర్తుతెలియని మృతదేహం గా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు.దర్యాప్తు మొదలెట్టిన కొద్ది గంటల్లోనే నగరంలో వేరోక చోట మొండెం లేని తలను కొందరు గుర్తించారు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని మొదట దొరికిన మొండానికి ఈ తలను అమర్చారు. ఉదయం గుర్తించిన మొండెం తాలుకా యువకుడిదే తల అని నిర్ధారణకు వచ్చారు.

దర్యాఫ్తులో దిమ్మతిరిగే నిజాలు!అక్కేసూత్రధారి!

నగరానికి చెందిన రాకేష్ అనే వ్యక్తి రెండురోజుల క్రితం కనిపించకుండా పోయాడని కేసు నమోదైంది. ఇప్పుడు ఈమృతదేహం దొరకటంతో ఆ కేసులో కొంత పురోగతి కనిపించింది. ఇప్పడు రాకేష్ ను హత్యచేసిన దుండగుల కోసం పోలీసులు గాలింపు చేప్టటారు.రాకేష్ ను హత్యచేయాల్సిన అవసరం ఎవరికుంది అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు షాకింగ్ విషయం తెలిసింది. రాకేష్ సోదరి షయన ను విచారించే సరికి హత్య వెనుక ఆమె ప్రోద్భలం ఉందన్న విషయం తెలుసుకున్నారు.షయన ఇచ్చిన వాంగ్మూలంతో పోలీసులు ఆమె ప్రియుడు నియాజ్ అతని మిత్రులు తవసీఫ్, అల్తాఫ్, అమన్ అనే నలుగురిని అరెస్ట్ చేశారు. స్నేహితుల సహకారంతో నియాజ్ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.ఈ కేసులో ఇప్పటికే షనయను అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

 

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju