NewsOrbit
జాతీయం న్యూస్

Baba Ramdev: కరోనా వ్యాక్సిన్ వేస్ట్..!యోగా గురు బాబా రాందేవ్ తాజా కామెంట్..!!

Baba Ramdev: అల్లోపతి వైద్యం మీద యోగా గురు బాబా రామ్దేవ్ మరోసారి అపనమ్మకం వ్యక్తం చేశారు.ఈసారి ఏకంగా కరోనా వ్యాక్సిన్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదంటూ కామెంట్ చేశారు.దేశం మొత్తం కరోన వ్యాక్సిన్ కోసం వెంపర్లాడుతూ ఉండగా యోగా గురు మాత్రం దాన్ని కరివేపాకులా తీసిపారేశారు.

Baba Ramdev says corona vaccine is waste
Baba Ramdev says corona vaccine is waste

తాను టీకా తీసుకోలేదని ,దాని వల్ల ఉపయోగం ఉంటుందని కూడా భావించడం లేదని రామ్దేవ్ చెప్పారు.సుదీర్ఘ కాలంగా తాను నమ్ముకున్న యోగా ఆయుర్వేదమే తనకు శ్రీరామరక్ష అని ఆయన పేర్కొన్నారు.కొన్ని దశాబ్దాలుగా తాను యోగా చేస్తున్నానని, ఆయుర్వేదాన్ని అనుసరిస్తున్నానని,కాబట్టి కరోనా టీకా తనకు అవసరం లేదన్నారు. అత్యంత పురాతనమైన ఆయుర్వేద వైద్య విధానాలకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఇదంతా ఒక ప్రణాళికాబద్ధంగా సాగుతోందన్నారు.అయితే రానున్న రోజుల్లో ఆయుర్వేద వైద్యమే అందరి ఆదరణ చూరగొనగలదని, ప్రపంచవ్యాప్తంగా దీనికి ఆమోదం లభించగలదని రాందేవ్ పేర్కొన్నారు.

పది రోజులుగా ట్విస్టులే ట్విస్టులు!

యోగా గురు బాబా రామ్దేవ్ ఎందుకని అలోపతి వైద్యానికి టార్గెట్ చేస్తున్నారో తెలీదు గానీ ఎన్ని రకాలైన సవాళ్లను వస్తున్నా ఆయన వెనక్కు తగ్గడం లేదు.ముందుగా కరోనా చికిత్సకు వాడుతున్న ఇంజెక్షన్లపై ఆయన విమర్శల దాడి చేశారు. అవేవీ పని చేయవని పేర్కొన్నారు.అల్లోపతి వైద్యులను కూడా ఆయన విడిచిపెట్టలేదు.వారు ఆధునిక హంతకులంటూ తీవ్రమైన ఆరోపణ చేశారు.ఐఎంఏ దీనిపై కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కి ఫిర్యాదు చేయగా ఆయన జోక్యం చేసుకొని రామ్దేవ్ చేత ఆ వ్యాఖ్యలను ఉపసంహరింపజేశారు.

Read More: West Bengal Politics: పశ్చిమ బెంగాల్ లో మరో ప్రహసనం:పీఎం, సీఎంల మధ్య నలిగిపోతున్న సీఎస్!!

సీన్ కట్ చేస్తే!

మళ్లీ ఆ పక్కరోజే రామ్దేవ్ స్వరాన్ని సవరించుకున్నారు. యథావిధిగా అల్లోపతి వైద్యాని దుయ్యబట్టారు.అల్లోపతి వైద్యులకు ఇరవై అయిదు ప్రశ్నలు వేశారు.ఆయన ధోరణిలో మార్పేమీ లేకపోవడంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వెయ్యి కోట్లకు పరువునష్టం దావా వేస్తానంటూ లీగల్ నోటీసు పంపింది.ఆయన మీద పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసింది.ప్రధాని నరేంద్రమోడీకి కూడా లేఖ రాసింది.ఆయనపై దేశద్రోహం నేరం కింద కేసు పెట్టాలన్నది ఐఎంఏ డిమాండ్. అంతటితో ఆగకుండా రామ్దేవ్ ను ఐఎంఏ బహిరంగ చర్చకు కూడా ఆహ్వానించింది. ఇంత జరుగుతుంటే కూడా రాందేవ్ లైట్ తీసుకున్నారు.ఈసారి ఏకంగా కరోనా వ్యాక్సినే యూజ్లెస్ అంటూ కామెంట్ విసిరేశారు.ఇంకా ఏం జరుగుతాయో చూడాలి.

 

Related posts

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?