NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Bandi Sanjay: కెసిఆర్ జైలుకుపోవడం పక్కా!బిజెపి సంజయ్ కీలక వ్యాఖ్యలు!

Bandi Sanjay: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వెంట బీజేపీ పడింది.సీఎం కేసీఆర్ కు సంబంధం ఉన్న కేసుల మీద కమలనాథులు ఆరా తీస్తున్నారు.ఆయనను జైలుకు పంపించి తీరుతామని తొడ గొట్టి చెబుతున్నారు.తెలంగాణ రాజకీయాల్లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

Bandi Sanjay Fires on KCR
Bandi Sanjay Fires on KCR

Bandi Sanjay: బండి సంజయ్ ఏం చెప్పారంటే!

కెసిఆర్ అవినీతి చరిత్రంతా తవ్వుతున్నామని తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. వారం రోజులుగా సీఎం కేసీఆర్ కి సంబంధం ఉన్న సహారా ఈఎస్ఐ తదితర కేసులపై ఆరాతీస్తున్నామన్నారు.ఈ సందర్భంగా తమకు చాలా ముఖ్యమైన సమాచారం లభించిందన్నారు.కెసిఆర్ ఎంత అవినీతిపరుడో తెలిపే సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు.ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని సంజయ్ పేర్కొన్నారు.కెసిఆర్ ని జైలుకు ఇప్పుడు పంపాలో కూడా బిజెపికి తెలుసునన్నారు.ఇ౦దుకో ప్రత్యేక వ్యూహాన్ని అవలంబిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

యథా సీఎం ..తధా మంత్రులు!

ముఖ్యమంత్రి కెసిఆరే కాదని, ఆయన మంత్రులు ,పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా అవినీతి పరులేనని ఆయన వ్యాఖ్యానించారు.ఇప్పటికి మొత్తం పధ్ధెనిమిది మంది మంత్రులు,ఎమ్మెల్యేల అవినీతి చరిత్రను సమాచార హక్కు చట్టం ద్వారా వెలికితీశామని సంజయ్ చెప్పారు.వీరందరి మీదా చర్యలకు డిమాండ్ చేస్తూ లాక్డౌన్ ఎత్తివేయగానే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని ఆయన వెల్లడించారు.తమ ఉద్యమ పంథా వేరుగా ఉంటుందని,అవినీతిపరులకు షాక్ తప్పదని సంజయ్ చెప్పారు.

టీఆర్ఎస్ ఎప్పుడూ శత్రువే!

బిజెపికి తెలంగాణ రాష్ట్ర సమితి ఎప్పుడూ శత్రువేనని,కలలో కూడా ఆ పార్టీ తో దోస్తానా చేయబోమని ఆయన ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు.తెలంగాణలో టీఆర్ఎస్ ప్రత్యామ్నాయం బీజేపీయే అయినప్పుడు ఆ పార్టీతో తామెందుకు స్నేహం చేస్తామని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ను అధికారం నుండి దింపేది బిజెపి ఒక్కటేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Read More: Corona: షాక్ః ప‌క్క రాష్ట్రంలో కొత్త ర‌కం క‌రోనా కేసు

ఈటల చేరిక ఖాయం

కాగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ వారంరోజుల్లో బీజేపీలో చేరతారని సంజయ్ స్పష్టం చేశారు.ఇందుకు సంబంధించిన ప్రక్రియ సాగుతోందని తెలిపారు.అయితే బిజెపిలో చేరాలంటే ఈటల తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. ఎందుకు ఈటల సుముఖంగానే ఉన్నారని, నరేంద్ర మోడీ బీజేపీ సిద్ధాంతాలు నచ్చి ఆయన తమ పార్టీలోకి వస్తున్నారని సంజయ్ వివరించారు.

 

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N