NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BJP: త‌గ్గేది లేదంటున్న బీజేపీ..ఇరు రాష్ట్రాల సీఎంల‌పై …

BJP: తెలుగు రాష్ట్రాల్లో బ‌ల‌ప‌డాల‌ని చూస్తున్న బీజేపీ ఈ మేర‌కు త‌న ముద్ర చాటుకునే ప్ర‌తి అవ‌కాశాన్ని ఉప‌యోగించుకుంటోంది. ఇందుకోసం అందివ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశం ఆధారంగా ఆయా రాష్ట్రాల సీఎంల‌ను టార్గెట్ చేస్తోంది. తాజాగా బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి మ‌రోమారు ఇద్ద‌రు సీఎంల‌పై విరుచుకుప‌డ్డారు. తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఏపీ ప్రజలను రాక్షసులతో పోల్చడం సిగ్గు చేటు అని మండిప‌డ్డారు. వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రిపై తక్షణం చర్యలు తీసుకోవాలని బీజేపి ఆంధ్రప్రదేశ్ శాఖ త‌ర‌ఫున‌ డిమాండ్ చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

Read More: KCR: గ‌ల్లీలో కొట్లాట‌… ఢిల్లీలో ఒకే మాట అంటున్న కేసీఆర్ , జ‌గ‌న్‌

 

కావాల‌నే ఇలా చేస్తున్నారంటూ…

రాయలసీమ కు సంబంధించిన ఎత్తిపోతల పథకం పైన తెలంగాణ ప్రభుత్వం కావాలని దుష్ప్రచారం చేస్తోందని విష్ణువ‌ర్ద‌న్ రెడ్డి ఆరోపించారు. రాబోయే ఉపఎన్నికల కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా వ్యాఖ్యలు చేయడం సిగ్గుమాలిన చర్య అంటూ తెలంగాణ మంత్రిపై బీజేపీ నేత ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ కు సంబంధించిన ప్రాజెక్టులో విష‌యంలో వెనక్కి తగ్గాల్సిన అవసరం లేద‌ని ఆయ‌న పేర్కొన్నారు. తెలంగాణ చేపడుతున్న అక్రమ ప్రాజెక్టుల‌పై మెతక వైఖరి అవసరం లేదని పేర్కొన్న విష్ణువ‌ర్ద‌న్ రెడ్డి అవసరం ఐతే అన్ని పార్టీలు ప్ర‌భుత్వానికి మద్దతు ఇస్తాయని వెల్ల‌డించారు.

Read More: YS Jagan: రూటు మార్చుతున్న టీఆర్ఎస్ … జ‌గ‌న్ పై ఆ మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

అస‌లు తెలంగాణ ప్ర‌భుత్వం చేస్తుందే…

తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులను కడుతోందని బీజేపీ నేత ఆరోపించారు. పాలమూరు, డిండి ప్రాజెక్టులకు సంబందించి ఏపీ ప్రభుత్వం కోర్టుకు వెళ్ళాలని ఆయ‌న సూచించారు. తెలంగాణ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ప్రాజెక్టు 11 షెడ్యూల్ లో ఉన్నప్పటికీ కోర్టును ఆశ్రయించిందని గుర్తు చేశారు. 11 వ షెడ్యూల్లో లేని పాలమూరు, దిండి ప్రాజెక్టులపైన ఆంధ్ర ప్రభుత్వం ఎందుకు కోర్టుకు వెళ్లడం లేదు అని ప్ర‌శ్నించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గోదావరి జలాలను పంచుకుందామని అట్టహాసంగా చర్చలు జరిపారని పేర్కొన్న ఆయ‌న మరి ఆ చర్చ‌ల ఫ‌లితం ఏమైంద‌ని ప్ర‌శ్నించారు. కేసీఆర్ గోదావరి జలాల పైన స్పందించిన విధంగా కృష్ణా జలాలపై ఏపీ సీఎం ఎందుకు స్పందించటం లేదని విష్ణువ‌ర్ద‌న్ రెడ్డి ప్ర‌శ్నించారు. కృష్ణా జలాల పంపకానికి సంబంధించి బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఎవరు ఎన్ని టీఎంసీలు పంచుకోవాలి చట్టబధంగా వివరంగా ఉన్న స‌మ‌యంలో వివాదం ఎందుకని ప్ర‌శ్నించారు. పోతిరెడ్డిపాడు పై అక్రమంగా కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం వెళ్లినప్పుడే ఆంధ్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని ఉంటే నేడు ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆయ‌న అన్నారు. ఈ వ్యవహారం మీ ఇద్దరి మధ్య కాదు, కోట్లమంది ఆంధ్ర ప్రజల మధ్య ఉన్న వివాదం అని పేర్కొన్నారు.

Related posts

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju