NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Kadapa Buruju: 300ఏళ్ల నాటి పురాతన బురుజు కట్టడం..! దీని విశేషం ఏమిటంటే..!!

Kadapa Buruju: సాధారణంగా రాయలసీమ అంటే ప్రతి ఒక్కరికీ గుర్తుకు వచ్చేది బాంబులు, కత్తులు గొడవలు, ఫ్యాక్షన్ రాజకీయాలు. కానీ రాయలసీమకు ఎంతో ఘన చరిత్ర, పురాతన కట్టడాలకు నెలవు. ఈ కోవలోనే జిల్లాలో కడప జిల్లాలో దాదాపు 300 సంవత్సరాల క్రితం నిర్మించిన పురాతనమైన బురుజు చెక్కుదెరకకుండా ఉండటం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఈ పురాతన బురుజు లోపల నివసించే ఇల్లు కూడా ఉండటం విశేషం. ఈ పురాతన బురుజు ఎక్కడ ఉంది. దాని చరిత్ర ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Kadapa Buruju 300 years history
Kadapa Buruju 300 years history

కడప జిల్లాలోని జమ్మలమడుగు ప్రాంతంలో ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలు, అద్భుతమైన కట్టాడలతో పాటు బ్రిటీష్ వారితో పోరాడిన గండికోట పౌరషానికి ప్రతీకగా నిలిచిన కొన్ని కట్టడాలు కనిపిస్తాయి. జమ్మలమడుగు నియోజకవర్గం పెద్ద ముడియం గ్రామంలో పురాతనమైన బురుజు గత చరిత్ర సాక్షీభూతంగా నిలుస్తుంది. దీని వయసు దాదాపు 300 సంవత్సరాల పైమాటే. ఈ బురుజు నిర్మించి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది అంటే అప్పటి కట్టడాలు ఎంతటి నాణ్యతతో నిర్మించారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ తెలుసుకోవాలంటే ఆ బురుజు ఎందుకు నిర్మించారు. దాని చరిత్ర ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్వం 1800 సంవత్సరంలో పెద్ద ముడియంలో బైరెడ్డి వంశీయులు ఆత్యంత ధనవంతులుగా, భూస్వాములుగా ఉండేవారు. బైరెడ్డి వంశానికి చెందిన బైరెడ్డి లక్ష్మీరెడ్డి 1836లోనే లండన్ లో బారిస్టర్ చదివారు. పెద్ద ఎత్తున ధనం, భూమి ఉన్న బైరెడ్డి వంశస్థులకు శత్రువులుగా కూడా ఎక్కువగా ఉన్నారు. ఈ బైరెడ్డి వంశస్థుల వద్ద వెండి నాణేలు (రాగి రూపాయి బిళ్లలు), అపారమైన ధన సంపద ఉండటంతో వీరిపై దివిటి దొంగల ముఖా గుర్రాలపై అర్ధరాత్రి వచ్చి దాడులు చేసే వారు. వారి నుండి దనం ఎక్కుకొని వెళ్లేవారు. దీంతో బైరెడ్డి వంశీయులు వినూత్నంగా ఆలోచించి అప్పటి కూలీలతో శతృదుర్భేధ్యంగా బురుజు కట్టడం నిర్మించారు. అనంతరం ఈ బురుజులోనే ధనం, వెండి నాణెలు దాచుకునే వారని చెబుతుంటారు. ఈ బురుజు లో ఇప్పటికీ నాడు వినియోగించిన గుండ్రాళ్లు ఉండేవని, వాటిని కొన్ని నెలల క్రితం తొలగించారని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ బురుజు ప్రత్యేకత ఏమిటంటే శత్రువులు గానీ దొంగల ముఠా గానీ వస్తే బురుజు నుండ దొంగలను చూడటానికి రంద్రాలు కూడా ఉన్నాయి. వీటి ద్వారా శత్రువుల రాకను ముందే పసిగట్టి బురుజు పై నుండి రాళ్లతో దాడులు చేసేవారని స్థానికులు చెబుతుంటారు. ఈ ప్రత్యేకమైన పురాతనమైన బురుజు కట్టడంలో సినిమాలు, షార్ట్ ఫిలిమ్స్ కూడా చిత్రీకరణ చేస్తుంటారనీ, పర్యాటకుల తాకిడి కూడా బాగానే ఉందని గ్రామస్తులు చెబుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ బురుజు నిర్మించిన బైరెడ్డి వంశీయులు ఉన్నత చదువులు చదువుకొని వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారనీ, వారు అప్పుడప్పుడు వచ్చి బురుజును, ఇంటిని పరిశీలించి వెళుతుంటారని గ్రామస్తులు పేర్కొంటున్నారు.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju