NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Teachers Day Celebration: ఉపాధ్యయ దినోత్సవ వేడుకల నిర్వహణపై ఏపి ప్రభుత్వ కీలక నిర్ణయం..ఉపాధ్యాయ లోకం ఆక్షేపణ

Teachers Day Celebration: భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి పురస్కరించుకుని ప్రతి ఏటా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవ (గురుపూజోత్సవం) వేడుకలు జరుపుకోవడం తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వం రేపు జరగనున్న ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ నేపథ్యంలో గురుపూజోత్సవ వేడుకలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయ లోకం ఆక్షేపణ వ్యక్తం చేస్తుంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయన్న కారణంతో గత నెల 16 నుండి రాష్ట్రంలో పాఠశాలలను పునః ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ap govt cancelled Teachers Day Celebration
ap govt cancelled Teachers Day Celebration

కోవిడ్ పేరు చెప్పి గురుపూజోత్సవ వేడుకలను రద్దు చేయడం అన్యాయమని ఏపి ప్రభుత్వ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి అన్నారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల రాష్ట్రంలోని ఉపాధ్యాయులు అంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు వివిధ శాఖల ఉద్యోగులకు అవార్డులు అందజేశారనీ, అప్పుడు లేని కోవిడ్ నిబంధనలు ఇప్పుడు ఎందుకు వచ్చాయని ఆయన ప్రశ్నిస్తున్నారు. కోవిడ్ నెపంతో ఉపాధ్యాయ దినోత్సవాన్ని రద్దు చేసి వారి ఉత్సాహాన్ని నీరు గార్చారని అన్నారు. ఉపాధ్యాయుల ఆవేదనను అర్థం చేసుకుని గురుపూజోత్సవాన్ని నిర్వహించాలనీ, దీనిపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించాలన్నారు. అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. అక్టోబర్ 5వ తేదీన జరిగే అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం రోజునైనా నిర్వహించాలనీ, వీలుకాకపోతే ఆన్ లైన్ ద్వారా గురుపూజోత్సవం ఖశ్చితంగా నిర్వహించాలని సీఎం జగన్మోహనరెడ్డికి ఆయన విజ్ఞప్తి చేశారు.

Read More:

1.PDS Rice: ఏపి గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాధరాజు సంచలన వ్యాఖ్యలు..!!

2.YS Vijayamma: విజయమ్మ మాస్టర్ ప్లాన్..! అందరూ ఉద్దండులే..! ఆ మాత్రం ఊహించలేరా..!!

3.Election commission of India: హూజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇదీ..

Related posts

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju