NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Badvel By Poll: బద్వేల్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల..! తొలి నామినేషన్ ఎవరు వేశారంటే..?.

Badvel By Poll: కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికల షెడ్యుల్ ను ఇటీవల ఎన్నికల సంఘం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ షెడ్యుల్ ప్రకారం నేడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. రిటర్నింగ్ అధకారి, రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలైన వైసీపీ, టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. వైసీపీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య సతీమణి డాక్టర్ దాసరి సుధ, టీడీపీ అభ్యర్థిగా ఓబులాపురం రాజశేఖర్ లను ఆయా పార్టీలు ప్రకటించారు. కాగా శుక్రవారం తొలి నామినేషన్ దాఖలైంది. నవతరం పార్టీ అభ్యర్థిగా డాక్టర్ గోదా రమేష్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. బద్వేల్ తహశీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను గోదా రమేష్ కుమార్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రమణ్యం పాల్గొన్నారు. తొలుత కడప నవతరం పార్టీ కార్యాలయంలో గోదా రమేష్ కుమార్ కు పార్టీ బిఫారంను పార్టీ అడ్ హక్ కమిటీ కన్వీనర్ షేక్ మహబూబ్ బాషా అందజేశారు.

Badvel Bypoll nomination process started
Badvel Bypoll nomination process started

Badvel By Poll: తప్పనిసరి పరిస్థితుల్లోనే నవతరం పోటీ

ఈ సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు మాట్లాడుతూ ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గమైన బద్వేల్ లో ముందుగా నేతలతో సంప్రదింపులు జరిపిన తరువాతే గోదా రమేష్ కుమార్ ను అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతి బాధాకరమైనప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేయకతప్పలేదన్నారు. అన్ని రాజకీయ పార్టీలను అధికార వైసీపీ ముందుగా సానుభూతి కోణంలో ఎన్నికల్లో పోటీ చేయవద్దని కోరి ఉండాల్సిందన్నారు. సీఎం జగన్మోహనరెడ్డి ముందుగా ఆ ప్రతిపాదన రాకపోవడం వారి తప్పిదమనేనన్నారు. దళిత బహుజన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గోదా రమేష్ కుమార్ గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించారనీ, తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లోనూ పోటీ చేశారని తెలిపారు. నవతరం పార్టీ నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. నవతరం పార్టీ చేపట్టిన ప్రత్యేక హోదా ఉద్యమం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యమంలో పాటు పలు అంశాలపై గోదా రమేష్ పోరాడారని ఆయన తెలిపారు.

Read More: Badvel By Poll: బద్వేల్ ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకున్న జగన్..! ముగ్గురు మంత్రులు, ఇద్దరు ఎంపీలతో సహా ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగింత..!!

Badvel By Poll: 8వ తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణ

కాగా నేటి నుండి ఈ నెల 8వ తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 13వరకూ గడువు ఉంది. ఈ నెల 30న పోలింగ్, వచ్చే నెల 2వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి జరగుతుంది. కోవిడ్ నిబంధనల మేరకు అభ్యర్థులు ప్రచారం నిర్వహించుకోవాలని రిటర్నింగ్ అధికారి కేతన్ గార్గ్ పేర్కొన్నారు. రోడ్ షోలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

Related posts

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju