గూఢచారి సినిమాతో హీరోగా అందరి దృష్టిని ఆకర్షించాడు అడివిశేష్. తదుపరి అవకాశాలు వెనువెంటనే అడివిశేష్‌ను చుట్టు ముట్టాయి. అయితే అడివిశేష్.. ఏ మాత్రం తొందరపడలేదు. అచితూచి అడుగులేస్తున్నాడు. నిజానికి గూఢచారి తర్వాత ఎం.ఎల్.వి.సత్యనారాయణ నిర్మాణంలో వెంకట్ కుంచం దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అడివిశేష్ రెడీ అయ్యాడు. ఆ సినిమా ఏదో కాదు.. హిందీలో ఘన విజయం సాధించిన `2 స్టేట్స్` సినిమా తెలుగు రీమేక్. జీవిత, రాజశేఖర్ పెద్ద కుమార్తె శివానీ రాజశేఖర్ హీరోయిన్గా తొలి చిత్రమిది. ఈ సినిమాపై అంచనాలు బాగానే పెరిగాయి. అయితే 50 శాతం సినిమా పూర్తయిన తర్వాత దర్శకుడికి, నిర్మాతకు క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో సినిమా ఆగిపోయిందట. ఇప్పట్లో సినిమా పూర్తయ్యేలా కనపడటం లేదు. నిర్మాత ఇప్పటి వరకు చేసిన అవుట్‌పుట్ పట్ల కూడా హ్యపీగా లేడు. దీంతో మరో దర్శకుడిని వెతుకుతున్నాడట. మరో దర్శకుడు దొరికే వరకు ఈ సినిమా స్టార్టయ్యేలా కనపడటం లేదు. అయితే హీరో శేష్‌కు వచ్చిన నష్టం ఏమీ లేదు. తను గూఢచారి 2.. మేజర్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. కానీ శివానీ తొలి చిత్రం ఇలా అర్ధాంతరంగా ఆగిపోవడం జీవితా రాజశేఖర్‌ను కాస్త కలవరపెడుతుంది.
previous post
next post
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!