NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CBI: పంచ్ ప్రభాకర్ కు పంచ్ పడింది..! ఇంటర్ పోల్ నోటీసు జారీ చేసిన సీబీఐ..!!

CBI:  వైసీపీ సానుభూతిపరుడైన ఎన్ఆర్ఐ పంచ్ ప్రభాకర్ కు ఉచ్చు బిగుసుకుంది. ఏపి హైకోర్టు న్యాయమూర్తులపైన, హైకోర్టు తీర్పులపైనా సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు పోస్టులు చేసిన వ్యవహారంపై ఇటీవల హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పంచ్ ప్రభాకర్ అరెస్టునకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో సీబీఐ నేడు ఇంటర్ పోల్ ద్వారా నోటీసులు జారీ చేసింది. పంచ్ ప్రభాకర్ అరెస్టు కోసం ఇంటర్ పోల్ ద్వారా బ్లూ నోటీసు జారీ చేసినట్లు సీబీఐ కేంద్ర కార్యాలయం నేడు వెల్లడించింది.

CBI issues interpol notice on punch prabhakar arrest
CBI issues interpol notice on punch prabhakar arrest

CBI: ప్రభాకర్ అరెస్టునకు బ్లూ నోటీసు జారీ చేసిన సీబీఐ

ప్రభాకర్ తో పాటు విదేశాల్లో ఉంటున్న మరో నిందితుడికి కూడా బ్ల్యూ నోటీసు జారీ చేసినట్లు పేర్కొంది. ఈ కేసులో ఇప్పటి వరకు 11 చార్జి షీట్లు దాఖలు చేసిన సీబీఐ విదేశాలలో ఉన్న నిందితుల అరెస్టునకు దౌత్య ఛానెళ్ల ద్వారా ప్రక్రియ ప్రారంభించింది. న్యాయమూర్తులు, న్యాయ వ్యవస్థ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అవమాన కరమైన రీతిలో పోస్టులు పెట్టిన అభియోగంపై నిందితులుగా ఉన్న అవుకు శ్రీధర్ రెడ్డి, జలగం వెంకట సత్యనారాయణ, శ్రీనాధ్ సుస్వరం, దరిస కిషోర్ రెడ్డి, సుద్దులూరి అజయ్ అమృత్ లపై వేరువేరుగా చార్జిషీట్లను సీబీఐ దాఖలు చేసింది.

దూకుడు పెంచిన సీబీఐ

ఏపిలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాలపై హైకోర్టులో ప్రతికూల తీర్పులు రావడంతో ఆగ్రహం  వ్యక్తం చేస్తూ పలువురు వైసీపీ సానుభూతి పరులు హైకోర్టు తీర్పులపై అభ్యంతరకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై దాఖలైన పిటిషన్ ను విచారించిన హైకోర్టు దర్యాప్తు చేయాలంటూ తొలుత ఏపి సీఐడీకి ఆదేశాలు ఇచ్చింది. కానీ సీఐడీ దర్యాప్తు సక్రమంగా చేయకపోవడంతో కేసును సీబీఐకి అప్పగించింది. అయితే సీబిఐ కూడా వైసీపీ నేతల పట్ల దూకుడుగా వ్యవహరించకపోవడంతో హైకోర్టు ఇటీవల సీరియస్ వ్యాఖ్యలు చేసింది. సీబీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పంచ్ ప్రభాకర్ ను పది రోజుల్లో అరెస్టు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో సీబీఐ దూకుడు పెంచి ఇంటర్ పోల్ నోటీసులు జారీ చేసింది.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?