buttermilk: ఓపిక వస్తుంది
చల్ల అనే పేరు కూడా ఉన్న మజ్జిగ నిజంగానే మన శరీరానికి చలువ చేస్తుంది. మనకుజ్వరం వచ్చినప్పుడు ఎక్కువగా మజ్జిగ లేదా మజ్జిగ అన్నం కలిపి మెత్తగా చేసుకుని తింటే కాస్త ఓపిక వస్తుంది. ఎక్కువగా మందులు వేసుకునేవారికి సహజంగా వేడి చేస్తుంది, అది తగ్గడం కోసం మజ్జిగ ( Butter Milk ) ఎక్కువగా వాడితే సరిపోతుంది. విరోచనాలు అవుతున్న సమయంలో మజ్జిగ వాడటం అనేది చాలా అవసరం. అయితే ఇంత మంచి చేసే మజ్జిగ వాడేటప్పుడు కూడా కాస్త జాగ్రత్త పాటించాలి.
buttermilk: మజ్జిగను తాగడం
మజ్జిగలో వెన్న లేకుండా చూసుకోవాలి. ఇది హృద్రోగాలకు దారి తీయవచ్చు. వెన్నలేని పల్చని నీళ్ల మజ్జిగ వాడితే అన్ని విధాలా మంచిది. దాహం తీర్చుకోవటానికి బజార్లో దొరికే సోడాలు , వాటర్ తాగటం కంటే కూడా మజ్జిగను తాగడం చాలా మంచిది. వేసవి లో క్రమం తప్పకుండా తాగితే వడదెబ్బ తగలదు. దాహం తీరుతుంది. మజ్జిగలో అల్లం, కరివేపాకు వేసుకుంటే ఆరోగ్యానికి ( Health ) మరి మంచిది. మన పెద్దవాళ్ళ కాలం లో రాత్రిపూట అన్నంలో పాలుపోసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి తోడు పెట్టి పొద్దున్నే టిఫిన్ గా తినేవారు. దాని వలన ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు.
పెరుగు రాత్రి పూటతింటే
అయితే మజ్జిగ అంటే పెరుగులో కాసిని నీళ్లుపోస్తే వచ్చేదే కదా అని పెరిగే వాడేద్దాం అని అనుకోకండి. పెరుగుకు, మజ్జిగకు మధ్య చాలా తేడా ఉంటుంది. పెరుగు రాత్రి పూటతింటే అయుక్షిణం. కానీ మజ్జిగకు ఇలాంటి నియమాలు ఉండవు. పెరుగును బాగా కవ్వంతో నురుగు వచ్చే వరకు చిలికి తగినన్ని నీళ్లు కలిపి మజ్జిగ ను తయారు చేసుకోవాలి . అంతేకాని పెరుగులో కాసిని నీళ్లు పొసి కలిపేసుకుని వాడకూడదు. కాబట్టి మజ్జిగను తక్కువగా చూడకండి.మీరు కానీ ఇలా చేసుకున్న పల్చని మజ్జిగ తాగుతున్నట్టయితే .. మీ ఆరోగ్యం కాపాడుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు అర్ధం.