NewsOrbit
న్యూస్ సినిమా

Akhanda Movie Review: ‘అఖండ’ మూవీ రివ్యూ..!!

Akhanda Movie Review: నటసింహం నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ‘అఖండ’ (Akhanda)చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రజ్ఞా జైస్వాల్, పూర్ణ కథానాయకులుగా నటించారు. శ్రీకాంత్, జగపతిబాబు, అవినాష్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రం బోయపాటి-బాలయ్య కాంబినేషన్ లో హ్యాట్రిక్ విజయం సాధించిందో లేదో చూద్దాం…

Akhanda teaser: Nandamuri Balakrishna promises a high-voltage actioner,  watch video | Entertainment News,The Indian Express

కథ:

చిన్నప్పుడు కవల పిల్లలుగా ఉన్న కథానాయకులను విడదీయమని స్వామిజీ చెబుతాడు. అందులో ఒకరు అఘోరాగా (బాలకృష్ణ)(Balakrishna) మారగా మరొకరు మురళీకృష్ణ (బాలకృష్ణ) గా అనంతపురంలో విద్యా సంస్థలు నడుపుతుంటారు. అయితే అదే జిల్లాలో భారీ ఎత్తున మైనింగ్ మాఫియా డాన్ గా శ్రీకాంత్(Sri Kanth) కనిపిస్తాడు. శరణ్య (ప్రజ్ఞా జైశ్వాల్)(Pragna Jaishwal) ఆ జిల్లాకు ఐఏఎస్ అధికారి గా వస్తుంది. ఇక కథానాయకుడు, ప్రతినాయకుడు మధ్య జరిగే ఘర్షణ మధ్య మిగతా స్టోరీలో అఘోరా ఎంట్రీ సస్పెన్స్ గా ఉంటుంది. ఆ తర్వాత దేవాలయాల ప్రాముఖ్యత గురించి, అఖండ ఉద్దేశాల గురించి సిద్ధాంతం గురించి ప్రేక్షకులకు తెలియజేస్తారు, అఖండ ఏ విధంగా కారణజన్ముడు అనేది అర్థమవుతుంది.

Surprising record by 'Akhanda' teaser

ప్లస్ పాయింట్స్

నందమూరి బాలకృష్ణ ఎప్పటిలాగే ద్వి లో అదరగొట్టాడు. ఒకపక్క అఘోర పాత్ర చేస్తూనే మరో పక్క అసలు పొంతన లేని క్యారెక్టర్ చేసి మెప్పించడంలో తన అనుభవం మొత్తాన్ని రంగరించాడు.

ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ థమన్(Thaman) కొట్టిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. థియేటర్లలో ప్రేక్షకులు చెవులకు చిల్లులు పడేలాగా మాస్ స్కోర్ సమకూర్చి ప్రేక్షకులను ఊపేశాడు. చివరికి థియేటర్ యాజమాన్యం స్పీకర్ సౌండ్ తగ్గించాల్సిన పరిస్థితి కొద్ది సెంటర్లలో ఏర్పడింది.

ఈ సినిమా ఇంటర్వెల్ ఎపిసోడ్ బాలయ్య-బోయపాటి మధ్య వచ్చిన ఎన్నో అద్భుత సీన్లలో మేటి అనే చెప్పాలి. మొదటి అర్ధ భాగం మొత్తం ఎంతో అద్భుతంగా సాగి ఇంటర్వెల్ దగ్గర చేసిన రచ్చకి బీభత్సం అనే మాట కూడా తక్కువే…

ఈ సినిమాలోని పాటలు, మ్యూజిక్, విజువల్స్ ప్రేక్షకులను కట్టి పడేస్తాయి. బోయపాటి ఈ విషయంలో మరింత జాగ్రత్త వహించి ఎక్కడా ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా చేశాడు.

Balakrishna looks fierce in trailer of Akhanda | The News Minute

మైనస్ పాయింట్స్

ప్రతిసారి బోయపాటి(Boyapati) బాలకృష్ణ (Balakrishna) చిత్రాలలో బాగా హైలెట్ అయ్యే పంచ్ డైలాగ్స్ ఇక్కడ పేలలేదు. ఒక మోస్తరుగా బాగానే ఉన్నా వీరి కలయికలో డైలాగ్స్ నుండి ఎక్కువ ఇంపాక్ట్ ఆశించిన ప్రేక్షకులు నిరుత్సాహపడవచ్చు.

సినిమా రెండో భాగం మొత్తం ఫైట్ సీన్లతో నింపేశారు. వీటి మధ్యలో కథ కనిపించదు. బాలయ్య ఫ్యాన్స్ కు ఇంపుగా ఉంటుంది కానీ మిగిలిన వారికి నప్పకపోవచ్చు.

అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం బి, సి సెంటర్ల లో తప్పించి మిగిలిన వారిలో కొందరికి బాగా రొటీన్ గా… క్లైమాక్స్ తో సహా అందరూ ఊహించే విధంగా ఉంటుంది.

బాలయ్య ఫ్యాన్స్‌కు కొత్త టెన్షన్.. 'అ' విషయం తెలిసి కూడా అఖండ టైటిల్ ఎలా  పెట్టారంటూ! | Balakrishna fans tension over akhanda title by Boyapati Srinu  - Telugu Filmibeat

విశ్లేషణ

మొత్తానికి బోయపాటి-బాలకృష్ణ చిత్రం నుండి సగటు సినీ ప్రేమికుడు ఏమి ఆశిస్తాడో దానిని ఎంతో ఎక్కువ మోతాదులో ‘అఖండ’ చూపించింది. బాలకృష్ణ ఫ్యాన్స్ కు ఒక రకంగా ఇది పండగే. యావరేజ్ ప్రమోషనల్ వీడియోలతో పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం అనూహ్యంగా అద్భుతమైన కంటెంట్తో ఆకట్టుకుంది. రొటీన్ స్క్రీన్ ప్లే, క్లైమాక్స్, పూర్తిగా నిండిపోయిన ఫైట్లు కొంతమందికి రుచించకపోవచ్చు కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విన్నర్ గా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

చివరి మాట: బాలయ్య – బోయపాటికి బ్లాక్ బస్టర్ కం బ్యాక్

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri