NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Pawan Kalyan: పవన్ పోటీ చేసే సీట్లు మారాయి..! కానీ..!?

discussion on pawan kalyan contesting seats

Pawan Kalyan: పవన్ కల్యాణ్ కు సినిమాల్లో క్రేజ్ ఎంత ఉందో రాజకీయాల్లో కూడా అంతే క్రేజ్ ఉందనేది వాస్తవం. అయితే.. అదే క్రేజ్ జనాల్ని సినిమాలకు క్యూ కట్టిస్తున్నంతగా.. ఎన్నికల్లో ఓట్లు వేసేలా క్యూ కట్టించలేక పోతోంది. 2014లో జనసేన పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ టీడీపీకి మద్ధతిచ్చి ఆ పార్టీ అధికారంలోకి వచ్చేలా కింగ్ మేకర్ అయ్యారు. కానీ.. 2019లో ఎన్నికల్లో పోటీ చేస్తే ఒకే ఒక్క సీటు గెలిచి.. తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో కూడా ఓడిపోయారు. మరో రెండున్నరేళ్లలో ఎన్నికలు రాబోతున్నాయి. అయితే.. ఈసారి పవన్ పోటీ చేయబోయే స్థానం గురించి అప్పుడే అనేక ఊహాగానాలు వస్తున్నాయి.

discussion on pawan kalyan contesting seats
discussion on pawan kalyan contesting seats

గత అనుభవం దృష్ట్యా..

‘ఈసారి గట్టిగా కొట్టాలి..’ ఇది పవన్ తోపాటు జనసేన నాయకులు, క్యాడర్ మనసులో మాట. ముఖ్యంగా పవన్ కల్యాణ్ కు 2019 సీన్ రిపీట్ కాకూడదు. (Pawan Kalyan) పవన్ ను కాకినాడ సిటీ లేదా రూరల్ నుంచి పోటీ చేయాలనే మాట వినపడుతోంది. కాపు సామాజికవర్గం, ఫ్యాన్స్ ఎక్కువగా ఉండటంతో అక్కడైతే బెటర్ అనేది ఓ మాట. అయితే.. అక్కడ వైసీపీ కూడా బలంగానే ఉంది. మంత్రిగా కన్నబాబు, ఎమ్మెల్యేగా ద్వారపూడి చంద్రశేఖర్ కు తగిన గుర్తింపు ఉంది. వాళ్లలో ఒకరిని ఓడించాలనేది ఓ ఆలోచన. అయితే.. రాయలసీమ నుంచి హిందూపురంలో గతంలో ఎన్టీఆర్, ఇప్పుడు బాలకృష్ణ, చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేసి గెలిచారు. కాబట్టి.. పవన్ కూడా తిరుపతి లేదా పుట్టపర్తి నుంచి పోటీ చేసి గెలవాలని ఓ మాట వినిపిస్తోంది.

పోయినచోటే వెతుక్కోవాలని..

ఇలా రాయలసీమ నుంచి ఓ స్థానం, ఉభయ గోదావరి జిల్లాల్లోని కాకినాడ నుంచి (Pawan Kalyan) పవన్ పోటీ చేయాలనేది జనసైనికుల కోరిక. అయితే.. వేరే స్థానంకు మారితే.. వ్యతిరేక వ్యాఖ్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి.. ఓడిన చోటే మళ్లీ పోటీ చేసి గెలిచి సత్తా చాటాలనే వారూ ఉన్నారు.  మొత్తంగా.. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. పవన్ పోటీ చేసే స్థానంపై అప్పుడే చర్చ గట్టిగానే మొదలైంది. అయితే.. గతంలో పవన్ ఓసారి ఏలూరు, అనంతపురం నుంచి పోటీ చేస్తానని.. చివరికి గాజువాక, భీమవరంలో పోటీ చేశారు. కాబట్టి.. ఈ అంశంపై పవన్ ఆలోచన ఏంటో.. ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ఆయనే చెప్పాలి..!

 

Related posts

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?