NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Tdp Janasena: టీడీపీ-జనసేన కలిస్తే.. అక్కడ ప్రభంజనమేనట..!!

tdp and janasena create wonders there

Tdp Janasena: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయముంది. 2024 లో జరిగే ఎన్నికలకు ఇప్పటి నుంచే ఏపీలో వార్తలు, విశ్లేషణలు, పొత్తులపై సంకేతాలు వస్తూ.. రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఇటివల చంద్రబాబు కూడా జనసేనతో పొత్తు విషయంలో వన్ సైడ్ లవ్ అంటూ హింట్ ఇచ్చారు. ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఎలాంటివో చెప్పడానికి ఇదే నిదర్శనం. అయితే.. ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన.. బీజేపీని కాదని టీడీపీతో జట్టు కడుతుందా..? అనేది చెప్పలేం. కానీ.. జనసేన-టీడీపీ కలుస్తాయనే ఊహాగానాలు వస్తున్నాయి. దీని ఆధారంగా ఈ రెండు పార్టీలకు చెందిన కొందరు రాజకీయ విశ్లేషకులు మాత్రం జనసేన-టీడీపీ కలిస్తే 5 జిల్లాల్లో కనీసం 40 సీట్లు సాధిస్తాయని లెక్కలు వేస్తున్నారు.

tdp and janasena create wonders there
tdp and janasena create wonders there

ఉత్తరాంధ్ర జిల్లాల్లో..

జనసేనకు బాగా పట్టున్న జిల్లాలుగా పశ్చిమ గోదావరి నుంచి శ్రీకాకుళం వరకూ అయిదు జిల్లాలను పరిగణిస్తున్నారు. ఈ అయిదు జిల్లాల్లో పశ్చిమ గోదావరిలో 15, తూర్పు గోదావరిలో 19, విశాఖపట్నంలో 15, విజయనగరంలో 9, శ్రీకాకుళంలో 10.. మొత్తంగా 68 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటన్నింటిలో కలిపి కనీసం 40 నియోజకవర్గాల్లో జనసేన-టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని ఆ (Tdp Janasena) రెండు పార్టీలకు చెందిన నాయకులు విశ్లేషణలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ గాలిలో కూడా విశాఖ సిటీ మొత్తం నాలుగు స్థానాలను టీడీపీ కైవసం చేసుకోవడం విశేషం. విజయనగరం వైసీపీ క్లీన్ స్వీప్ చేసినా.. టీడీపీకి పట్టున్న శ్రీకాకుళంలో వైసీపీ గాలి వీచినా.. వచ్చే ఎన్నికలకు పరిస్థితులు మారొచ్చని ఈ రెండు పార్టీల అంచనా.

ఊహాగానాలే అయినా..

తూర్పు గోదావరిలో 2014, 2019లో వైసీపీకే ఎక్కువ సీట్లు వచ్చాయి. పశ్చిమ గోదావరిలో (Tdp Janasena) టీడీపీకి బలం ఎక్కువే అయినా.. 2019లో వైసీపీకి 13 సీట్లు వచ్చాయి. ప్రస్తుతం జనసేన పుంజుకుంటున్న వార్తల నేపథ్యంలో టీడీపీకి పొత్తు కలిసొస్తుందంటున్నారు. అందుకే చంద్రబాబు వన్ సైడ్ లవ్ కామెంట్స్ చేశారనే వాదనలూ లేకపోలేదు. అయితే.. ఈ రెండు పార్టీలు పొత్తు ప్రస్తుతానికి ఊహాగానమే. పవన్ ఈ విషయంలో ఆచితూచి మాట్లాడారు కాబట్టి.. ఈ విశ్లేషణలన్నీ అధికారికం కాదు. కేవలం పార్టీల అభిమానులు, కొందరు నేతలు చేసిన విశ్లేషణలుగా మాత్రమే పరిగణించాల్సి ఉంది.

 

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju