NewsOrbit
న్యూస్ సినిమా

Deepti Sunaina : దీప్తి సునైనా – షణ్ముఖ్ మధ్యలో తనీష్ ఎందుకు వచ్చాడు.. అయ్యబాబోయ్ అసలు ఏం జరుగుతోంది ?!

Deepti Sunaina

Deepti Sunaina : ప్రస్తుతం సోషల్ మీడియాలో దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ ల బ్రేకప్ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. దీప్తి సునైనా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యూట్యూబ్ లోను, సోషల్ మీడియా లోనూ రకరకాల వీడియోలు, కవర్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ బాగా పాపులర్ అయ్యారు. షణ్ముఖ్ కూడా సోషల్ మీడియాలో బాగానే పేరును సంపాదించుకున్నాడు. ఈ ఇద్దరూ కూడా మా టీవిలో ప్రసారమయిన అతి పెద్ద రియాలిటీ షో అయిన బిగ్ బాస్ షో లోకి హౌస్ మేట్స్ గా వెళ్లారు. అయితే ఇద్దరూ కూడా ఒకేసారి కాకుండా వేరు వేరు సీజన్స్ లో బిగ్ బాస్ హోస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

Deepti Sunaina : బిగ్ బాస్ లోకి రాకముందే షన్ను, దీప్తి రిలేషన్ షిప్ లో ఉన్నారా..?

Deepti Sunaina

దీప్తి సునైనా బిగ్ బాస్ హౌస్ తెలుగు సీజన్ 2 లో పార్టిసిపేట్ చేయగా షన్ను మాత్రం బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో రన్నరప్ గా నిలిచాడు. అయితే ఇక్కడ గమనించాలిసిన విషయం ఏంటంటే.. వీరిద్దరూ వేరు వేరు సీజన్స్ లో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందు రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఇద్దరూ కూడా తమ ప్రేమకు గుర్తుగా చేతులపై టాటూలు కూడా వేయించుకున్నారు. మరి అంతలా ప్రేమించుకున్న ఈ ఇద్దరూ బ్రేకప్ చెప్పుకోవడం చూసి వారి అభిమానులు సైతం ఎంతగానో బాధ పడుతున్నారు.

Deepti Sunaina : పాపం షన్ను బిగ్ బాస్ రన్నరప్ గా నిలిచినా ఏ మాత్రం సంతోషంగా లేడు.. ఎందుకంటే..?

Deepti Sunaina

షన్ను “బిగ్ బాస్ తెలుగు 5” రన్నరప్ గా నిలిచినా గాని ఆ సంతోషం షణ్ముఖ్ జస్వంత్ కు ఎన్నో రోజులు నిలబడలేదు. ఎందుకంటే షన్ను ఎంతగానో ప్రేమించిన దీప్తి సునైనా తమ ప్రేమకు బ్రేకప్ చెబుతున్నట్టు అధికారంగా ప్రకటించింది. అలాగే దీప్తి నిర్ణయాన్ని కూడా షణ్ముఖ్ స్వాగతించాడు. అది పూర్తిగా తన ఇష్టం అని దానికి నేను కట్టుబడి ఉంటానని చెప్పుకొచ్చాడు. ఇక్కడితో మేటర్ అయిపొయింది అని అనుకున్నారు అంతా.. కానీ., వీరి ప్రేమకధలో వివాదాస్పద నటి అయిన శ్రీరెడ్డి మధ్యలో ఎంటర్ అయ్యి దీప్తిని ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది.

షన్ను, దీప్తి ప్రేమ కధలోకి శ్రీ రెడ్డి ఎందుకు వచ్చిందబ్బా..? తనీష్ ను ఎందుకు లాగింది..?

Deepti Sunaina

దీప్తి తన బ్రేకప్ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన తరువాత శ్రీరెడ్డి దీప్తిని ఉద్దేశించి నువ్వు “బిగ్ బాస్ తెలుగు సీజన్ 2″లో చేసిందేంటి.. అప్పుడు తనీష్‌తో క్లోజ్ గా ఉన్నావ్ కదా.. మరి ఇప్పుడు షన్ను సిరి తో క్లోజ్ గా ఉన్నాడని బ్రేకప్ చెప్పడం కరెక్టా.. నువ్వు చేస్తే ఒప్పు.. అదే పని షన్ను చేస్తే తప్పా అన్నట్టు దీప్తిని ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేసింది. శ్రీ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తాజాగా దీప్తి సునైనా స్పందిస్తూ ఆమెకి తిరిగి కౌంటర్ ఇచ్చిందనే చెప్పాలి.

శ్రీరెడ్డికి జలక్ ఇచ్చిన దీప్తి:

Deepti Sunaina

“నేను బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లోకి ప్రవేశించినప్పుడు నా వయసు కేవలం 20 సంవత్సరాలు మాత్రమే.. ఆ షోలో పాల్గొన్నప్పుడు నేను చాలా చిన్నదాన్ని. నిజంగా హౌస్ లో ఉన్నవాళ్ళ గురించి నాకు ఎటువంటి క్లారిటీ గాని వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో అనే విషయాలపై అవగాహనా లేదు. ఎందుకంటే ఆ వయసులో నాకు పెద్దగా అలోచించి నిర్ణయం తీసుకునే మెచ్యూరిటీ లేదు. కానీ బిగ్ బాస్ షో ద్వారా నేను జీవితంలో ఎలా ఉండాలో అనే చాలా విషయాలను నేర్చుకున్నాను” అంటూ శ్రీ రెడ్డిని ఉద్దేశించి చెప్పుకొచ్చింది దీప్తి. ఏది ఎలా ఉన్నాగాని బిగ్ బాస్-5 హౌస్ లో షన్ను, సిరితో క్లోజ్ గా ఉండడం చూసి బాగా హర్ట్ అయ్యి ఉంటుందని మాత్రం కచ్చితంగా తెలుస్తుంది.

Related posts

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju