NewsOrbit
న్యూస్

Karthika Deepam Jan 27 Today Episode: కార్తీక్ ను దీప క్షమిస్తుందా.. లేక కార్తీక్ చేసిన పనికి ఇల్లు వదిలి వెళ్లిపోతుందా..?

Karthika Deepam Jan 27 Today Episode: కార్తీక దీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ భలే ఆసక్తికరంగా ముందుకు కొనసాగుతుందిన్. నిన్నటి ఎపిసోడ్ లో డాక్టర్ బాబును హోటల్లో సర్వర్ గా పనిచేయడం చూసిన దీప ఒక్కసారిగా బాగా ఎమోషనల్ అయిపోతుంది.ఇంకా ఈరోజు ఎపిసోడ్ కూడా అదే సీన్ తో ఓపెన్ అవుతుంది.కార్తీక్ ను చూసి దుఃఖం తట్టుకోలేక ఏంటి హోటల్లో పని చేస్తున్నారా..అయ్యో దేవుడా ఏంటిది అని బోరున విలపిస్తుంది.ఇది చూడ్డానికిగా నేను ఇంకా బతికింది, దీనికోసమేనా నేను పదకొండేళ్లు ఊపిరి బిగపట్టి మరి ఇన్ని కష్టాలను అనుభవించిది డాక్టర్ బాబు అంటుంది.

Karthika Deepam Jan 27 Today Episode: కార్తీక్ ను హోటల్లో చుసిన దీప రియాక్షన్ ఏంటి.?

ఈ చేతులతో ఒకప్పుడు మీరు చేసిన పనేంటి, ఇప్పుడు మీరు చేస్తున్న పనేంటి.మీరు ఈ పని చేసేముందు నా గొంతునొక్కి చంపేసి ఉన్నా బావుండేది డాక్టర్ బాబు.నేను బతికి ఉండగా మిమ్మల్ని ఇలా చూడలేనండీ.నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకూ నేను మిమ్మల్ని పోషించుకుంటాను.మీరొక డాక్టర్ మీరు గర్వంగా బతకాలి అని ఎమోషనల్ అయ్యి వెంటనే ఆనంద్ ని తీసుకుని ఇంటికెళ్లండి.మిమ్మల్ని ఇలా చూసి వీడుకూడా ఏడుస్తున్నాడు తీసుకెళ్లండి అని కార్తీక్ ని హోటల్ నుంచి ఇంటికి పంపించేస్తుంది. ఇంతలో అక్కడకు వచ్చిన హోటల్ యజమాని కార్తీక్ ని చూపించి ఆయన అనగానే మా ఆయన అంటుంది దీప. ఇక చీటీ ఇచ్చేవాడు సాయంత్రం వస్తా అన్నాడు అని యజమాని చెప్పడంతో సరే అండి అప్పటి వరకూ ఇక్కడే ఉంటాను.ఎవరూ లేరు కదా పని చూసుకుంటా అని లోపలికి వెళ్ళిపోతుంది.

Keerthy Suresh: చానల్ స్టార్ట్ చేసిన హీరోయిన్ కీర్తి సురేష్..!!
ఆశ్రమం నుంచి ఆనందారావు, సౌందర్యలను వెళ్ళిపోమన్న ఆశ్రమ సిబ్బంది:

సీన్ కట్ చేస్తే ఆదిత్య మోనిత దగ్గర నుండి ఇంటికి రాగానే శ్రావ్య వచ్చి ఏంటి ఇంత లేట్ చేశావ్.. కాల్ చేద్దామంటే నా ఫోన్  రిపేర్ కి ఇచ్చాను అంటుంది. అప్పుడు ఆదిత్యకి తనఫోన్ గుర్తుకురావడంతో ఫోన్ కారుపై పెట్టి మర్చిపోయాను ఎవరు తీసుకెళ్లారో ఏమో, అందులో చాలా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉందని చెబుతాడు.ఇక ప్రకృతి వైద్యశాలలోనీ సిబ్బంది ఆనందరావు దగ్గరకు వచ్చి మీరు ప్రశాంత కోసం ఇక్కడికి వచ్చారు కానీ రుద్రాణితో గొడవ తరువాత ఎకరెవరో వచ్చి మీ గురించి అడిగి మీ ప్రశాంతతను దెబ్బతీస్తున్నారు.అందుకే మీరు కొన్నాళ్లు మరో ఆశ్రమంలో ఉండటమే మంచిదని చెబుతాడు.వేరే ప్రదేశంలో మాది వేరే బ్రాంచ్ ఉంది అక్కడకు వెళ్లాలని చెబితే సరే అంటాడు ఆనందరావు.

Pushpa: ఈ రికార్డు చూస్తే నయా పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ అనక తప్పదు..!
బాధలో దీప… కార్తీక్ ను క్షమిస్తుందా.?

ఇక ఇంటికి వచ్చిన దీప కోపంతో, బాధతో ఉంటుంది. దీపతో మాట్లాడేందుకు కార్తీక్ ఎంత ప్రయత్నించినా కోపంతో వెళ్లిపోతుంది. నీ కోపాన్ని భరించగలను కానీ నీ మౌనాన్ని భరించలేను మాట్లాడు దీప అని కార్తీక్ అనడంతో.. మీరు ఒక మాటిస్తేనే మాట్లాడతాను అంటుంది. ఏం చేయాలని అడిగిన కార్తీక్ తో ఈ చేతులు కొన్ని వందల మంది ప్రాణాలను కాపాడాయి,ఈ  చేతుల్లో గొప్ప శక్తి ఉంది, భగవంతుడి ప్రతిరూపాల్లాంటి ఈ చేతులు ప్రసాదాలు స్వీకరించాలి కానీ ఎంగిలి మెతుకులు ఎత్తడానికి కాదు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది.

 

 

వేరే పని దొరక్క అని కార్తీక్ చెప్పేలోపే ఈలోపు దీప నాలుగు రోజులు పస్తులుంటే పులి గడ్డి తింటుందా? అని అడుగుతుంది. మరోసారి ఇలాంటి పని చేయనని మాటివ్వమని అడుగుతుంది. మరి నన్నేం చేయమంటావ్ అంటే చేస్తే వైద్యం చేయాలి లేదంటే మహారాజులా కూర్చోవాలని చెబుతుంది.

అమ్మా, నాన్నలను చూసిన విషయం కార్తీక్.. దీపకు. చెప్పేశాడా..?

ఇక కొద్దిసేపైన తర్వాత కార్తీక్ ఒంటరిగా కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు అది చూసి మళ్లీ దగ్గరకు వస్తుంది దీప నాపై కోపం మొత్తం పోయిందా దీప అంటే..అదేమి. లేదండి మీరు హోటల్లో పనిచేయడం చూసి తట్టుకోలేకపోయా అంటుంది.అలాగే నేను నీ దగ్గర ఒక విషయం దాచాను అని నేను ప్రకృతి వైద్యశాలలో ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళితే అక్కడ దిక్కులేనివాళ్లలా మమ్మీ, డాడీ కనిపించారని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఒకే ఊర్లోనే అందరం ఉన్నాం కానీ వాళ్ళని చాటుగా చూశానే కానీ పలకరించలేదు, ఇంతకన్నా దుర్మార్గం ఇంకేముంటుందని బాధపడతాడు.

Samantha: మంచి స్పీడుగా వున్న సమంత.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటోంది.!
మరి దీప కూడా అత్త మామలను చుసిన విషయం చెబుతుందా… దాస్తుందా..?

నేను ఎన్ని తప్పులు, పొరపాట్లు చేసినా అన్నిటినీ వాళ్లు భరించారు, గొప్ప తల్లిదండ్రులు వాళ్లు అంటాడు. హోటల్ లో తలుపు చాటున ఉండి వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు విన్నాను అని ఆ మాటలు దీపకు చెప్పి బాధపడి నేను ఇంత రాక్షసుడిగా మారిపోయానేంటి దీప అంటాడు. స్పందించిన దీప ఏదో ఒకరోజు కలుస్తాం కదా అని నేను కూడా అత్తయ్య మావయ్యలను ఆశ్రమంలో చుసిన విషయం మీ దగ్గర దాచాను అండి అని కార్తీక్ తో దీప చెబుతుంది. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ముగిసింది…

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?