హెల్త్

Childrens : మీరు  ఈ విలువయిన గిఫ్ట్   మీ పిల్లలకు ఇస్తున్నారా ?

Children: పిల్లల జీవితం సుఖం గా గడవాలంటే తల్లిదండ్రులు ఇలా చేయకతప్పదు అని గమనించండి!!
Share

Childrens : 1.. సురక్షిత భావన కలుగ చేయండి: పిల్లలు వారి ఆలోచనలు, భయాలు ధైర్యంగా  మీకు చెప్పుకోగలిగే చెప్పే వాతావరణం కల్పించండి. ఇంట్లో భధ్రత ఉంది అనే భావన  వారికి   కలగాలి. ఏదైనా పేరెంట్స్ తో చెప్పుకోవాలి అని అనిపించేలా చేసుకోవాలి.
2.. పొగడ్త కాదు అభినందన :   పిల్లలు ఏదైనా పని బాగా  చేసినపుడు మనస్పూర్తిగా అభినందించండి.కానీ పొగడకండి.  అభినందన ఆత్మ విశ్వాసాన్ని పెంచి    పిల్లలు మరింత సాధించడానికి ఉపయోగపడుతుంది.
3.. అవుట్ డోర్ :   ఆరోగ్యకరమైన పెరుగుదలకి ఆరుబయట ఆడుకోవడం అనేది చాల అవసరం.   బయట ఆడే  ఆటలు పిల్లలు  శారీరకంగా దృఢంగా, ఉత్సహం గా  ఉండేలా చేస్తాయి. బయట ఆడుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి మానసికం గా కూడా చాలా స్ట్రాంగ్ అవుతారు.
4..  బలాలు గుర్తించండి:  పిల్లలో ఉన్న బలాలు గుర్తించి  వారి బలాల మీద దృష్టి  పెట్టడానికి సహకరించండి.
5.  ఈ విషయం లో హద్దు  పెట్టండి: ఎలక్ట్రికల్ వస్తువులు ఎక్కువ  వాడితే రేడియేషన్ భారిన పడతారు.  వీటిని ఎక్కువ  వాడడం వల్ల ఎమోషనల్ గా దూరం  అవడం తో పాటు  సరిపడినంత నిద్ర లేక ,నిద్రలేమి కి కారణం అవుతుంది. కాబట్టి వాటి వాడకం లో హద్దు అవసరం.

Children: మీ పిల్లల కోసం ఇలా చేసి వారికి మంచి భవిషత్తు ని ఇవ్వండి!!

6.   భార్యాభర్తల మధ్య బంధం :  పిల్లల్ని పెంచడంలో తల్లి , తండ్రి ఇద్దరిది  సమానమైన పాత్ర అనడం లో ఎలాంటి సందేహం లేదు. పిల్లలకి  రోల్ మోడల్స్ మీరే . తల్లిదండ్రులు  గొడవ పడుతూ ఉండే అది పిల్లల్ని విపరీతం గా  బాధిస్తుంది. గొడవలు   సహజమే కావచ్చు , కానీ ఆ సంఘర్షణని వీలైనంత తగ్గించుకోండి. తప్పదు అంటే వారు లేనప్పుడు చర్చించుకోండి.    మీ ఇద్దరి మధ్య దృఢమైన బంధం ఉండడం అనేది  మీరు పిల్లలకి ఇచ్చే గొప్ప గిఫ్ట్   అని మరువకండి. కాబట్టి మీ బంధాన్ని మరింత  ప్రేమగా ఉండేలా చూసుకోండి.
7..   మాట్లాడుతూ ఉంటే : తల్లి దండ్రులు పిల్లతో రోజూ మాట్లాడుతూ ఉండడం   అనేది  వారిలో  చాలా మార్పు తీసుకువస్తుంది. పిల్లలకి ఇది చాలా  ముఖ్యమైనది.   వీలైనంత వారితో మాట్లాడుతూ  ఉండడం మరువకండి.  వారు చెప్పేది శ్రద్దగా విని వారి ప్రపంచాన్ని అర్థం  చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వారిని ప్రశ్నలు అడగండి దానితో పాటు వారు అడిగే  ప్రతి  ప్రశ్నలకు ఓపికతో సమాధానాలు  ఇవ్వండి.
ఆఖరుగా గుర్తుంచుకోవాలిసింది తల్లిదండ్రులకు సహనం ,ఓపిక క్రమ శిక్షణ ఉంటే పిల్లలను పెంచడం చాల తేలికవుతుంది.
కొత్త విషయాలు నేర్చుకోవడానికి , కథలకు  సమయం  అంటూ ఇలా ఒక ప్రణాళికను రెడీ చేసిపెట్టండి.


Share

Related posts

Panipuri: మిక్స్డ్ ఫ్రూట్ పానీపూరీ టెస్ట్ చేశారా.. ఇలా చేసుకుని తింటే అస్సలు వదలరు..!

bharani jella

యూరిన్ ఇన్ఫెక్షన్ పోవాలంటే ఇలా చేయండి!

Teja

Vishamushti: వ్యాధుల్ని హరించే విషముష్టి గురించి తెలుసుకున్నారా..!?

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar