NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: వైఎస్ఆర్ తల్లీ బీడ్డా వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్

CM YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నేడు విజయవాడలో ఆధునాతన వసతులతో కూడిన 500 వైఎస్ఆర్ తల్లీ బిడ్డా ఎక్స్ ప్రెస్ వాహనాలను జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. దాదాపు 500 కొత్త ఎయిర్ కండిషన్డ్ వాహనాలను రాష్ట్ర నలుమూలలకు ఈ రోజు పంపుతున్నామన్నారు. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు మంచి జరగాలని మొట్టమొదట నుండి ఈ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. చెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు, ఆ చెల్లెమ్మలు గర్భం దాల్చిన వెంటనే వారికి అండగా ఉంటూ రకరకాల కార్యక్రమాలు చేస్తున్నామన్నారు.

CM YS Jagan launches ysr talli bidda express vijayawada
CM YS Jagan launches ysr talli bidda express vijayawada

 

అందులో భాగంగానే గర్భవతి అయిన చెల్లెమ్మ 108 కి ఫోన్ చేసిన వెంటనే వాహనం అక్కడకు వచ్చి ఆసుపత్రికి తీసుకువెళ్లడమే కాకుండా నాణ్యమైన సేవలు అసుపత్రిలో అందించి డబ్ల్యుహెచ్ఓ, జీఎంపీ ప్రమాణాలు కల్గిన మందులు కూడా వారి చేతిలో పెడుతున్నామన్నారు. ఇంటికి వెళ్లేటప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి, వారు ఇబ్బంది పడకుండా ఉండేందుకు సీజేరియన్ అయితే రూ.3 వేలు, సహజ ప్రసవం అయితే రూ.5 వేలు ఆరోగ్య ఆసరా కింద విశ్రాంతి సమయంలో కూడా తోడుగా ఉండేందుకు ఈ మొత్తాన్ని చెల్లెమ్మ చేతిలో పెట్టి ఆమెను ఈ తల్లీ బిడ్డ ఎయిర్ కండీషన్ల వాహనంలోనే ఇంటి వరకు పంపించడం జరుగుతోందని చెప్పారు.

 

గతంలో ఎలాంటి పరిస్థితి ఉండేదో అందరికీ తెలుసునన్నారు. అరకొరగా ఉండే వాహనాలు, అదీ ఒక్కొక్కసారి అందుబాటులో లేని పరిస్థితి ఉండేదన్నారు. నాడు నేడుతో ప్రభుత్వ ఆసుపత్రి రూపు రేఖలు మారుతున్నాయని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆళ్ల నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, శంకర నారాయణ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

 

Related posts

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N