NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Rahul Gandhi: ‘దేశానికి ఆయన ఆలోచనలు అవసరం’.. రాహుల్ గాంధీకి యావదాస్తి రాసి ఇచ్చిన డెహ్రాడూన్ వృద్ధురాలు

Rahul Gandhi: స్వాతంత్రోద్యమ కాలంలో దేశ వ్యాప్తంగా చాలా మంది తమ స్థిర చరాస్తులను జాతీయ కాంగ్రెస్ పార్టీకి రాసి ఇచ్చారు. ఆ తరువాత కాలంలో వారసులు లేని చాలా మంది తమ ఆస్తులను దేవాలయాలకు, అన్నదాన సత్రాలకు దానంగా ఇవ్వడం చూశాం. కానీ ప్రస్తుత రోజుల్లో ఓ 78 ఏళ్ల వృద్ధురాలు తన యావదాస్తిని ఓ జాతీయ పార్టీ నేత పేరుతో వీలు రాయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్ కి చెందిన వృద్దురాలు తన చరాస్తినంతా ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ పేరిట రాసి ఇచ్చింది. డెహ్రాడూన్ లోని నెహ్రూ కాలనీకి చెందిన పుష్ప ముంజియాల్ అనే వృద్ధురాలు ప్రస్తుతం ఓ వృద్ధాశ్రమంలో ఉంటోంది. ఆమెకు వారసులు ఎవరు లేరు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై అభిమానంతో తనకు ఉన్న రూ.అరకోటికిపైగా ఆస్తికి రాహుల్ రాహుల్ ను నామినీగా పేర్కొంటూ వీలునామా రాయించి స్థానిక కోర్టులో సమర్పించింది. వీటికి సంబంధించిన పత్రాలను ఉత్తరాఖండ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రీతమ్ సింగ్ కు సోమవారం అందజేస్తూ, తను ఈ పని ఎందుకు చేశారో వివరించారు.

Dehradun old women transfers al her property to Rahul Gandhi
Dehradun old women transfers al her property to Rahul Gandhi

Rahul Gandhi: రాహుల్ ఆలోచనలు ప్రభావితం చేశాయి

నిరాడంబరత, నిజాయితీ, నిష్కలంకతత్వం ఉన్న నాయకుడు రాహుల్ గాంధీ అని పేర్కొన్న ఆమె రాజకీయ ప్రత్యర్ధులు ఆయనను అనవసరంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆయనను వేధించడం తనకు భాద కల్గించిందనీ, ఆందుకే ఆయనకు మద్దతు గా నిలవాలనుకున్నానని పేర్కొన్నారు. రాహుల్ ఆలోచనలు దేశానికి అవసరమని, ఆయన ఆలోచనలు తనను ప్రభావితం చేశాయనీ, అందుకే తన ఆస్తిని ఆయనకు ఇస్తున్నానని చెప్పారు. తొలుత తన ఆస్తిని రాహుల్ గాంధీ భార్యకు ఇవ్వాలని భావించాననీ, కానీ ఆయనకింకా వివాహం కాకపోవడంతో రాహుల్ పేరిటే వీలునామా రాసినట్లు వెల్లడించారు. బ్యాంకుల్లో ఉన్న 50 లక్షల ఫిక్డ్స్ డిపాజిట్ లకు రాహుల్ గాంధీ పేరును నామినీగా రాసిన ఆమె తన వద్ద ఉన్న పది తులాల బంగారు ఆభరణాలను మరణానంతరం రాహుల్ గాంధీకి చెందేలా వీలు రాశారు.

 

అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ పార్టీ ప్రజల మనసును గెలవలేకపోయింది. ప్రజాకర్షక పథకాలను పార్టీ మేనిఫెస్టోలో పెట్టినప్పటికీ ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి చవిచూసింది. అయినప్పటికీ ఆ రాష్ట్రానికి చెందిన ఓ వృద్ధురాలి మనసును రాహుల్ గాంధీ గెలుచుకున్నారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ అభిమానులు స్పందిస్తున్నారు. రాహుల్ అభిమానులు ఆ వృద్ధురాలి చర్యను మెచ్చుకుంటున్నారు.

Related posts

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju