NewsOrbit
న్యూస్

Shiv Sena MP Sanjay Raut: శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు బిగ్ షాక్ ఇచ్చిన ఈడీ..

Shiv Sena MP Sanjay Raut: శివసేన సీనియర్ నేత, ఎంపి సంజయ్ రౌత్‌కు ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బిగ్ షాక్ ఇచ్చింది. ఆయనకు సంబంధించిన ఆస్తులను సీజ్ చేసింది. రూ.1,043 కోట్ల విలువైన పాత్రచాల్ భూకుంభకోణంలో ఆయనతో పాటు కుటుంబ సభ్యులకు చెందిన అలిబాగ్‌లోని ఎనిమిది భూములు, ముంబయి చాదర్‌లోని ఓ ప్లాట్ ను సీజ్ చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ ఈ మేరకు చర్యలు చేపట్టింది. పాత్రచాల్ భూకుంభకోణం కేసుకు సంబంధించి మహారాష్ట్ర కు చెందిన వ్యాపారవేత్త ప్రవీణ్ రౌత్ ను ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఈడీ అరెస్టు చేసింది, అనంతరం చార్జీషీట్ కూడా దాఖలు చేసింది. పీఎంసీ బ్యాంకు మోసానికి సంబంధించి సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్ ను గత ఏడాది ఈడీ అధికారులు ప్రశ్నించారు. ప్రవీణ్ రౌత్ భార్య మాధురితో వర్షాకు ఉన్న సంబంధాలపై ఈడీ ప్రశ్నించింది. ఇప్పుడు వీరికి చెందిన రూ.11.5 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసింది.

ED attaches Shiv Sena MP Sanjay Raut assets
ED attaches Shiv Sena MP Sanjay Raut assets

Shiv Sena MP Sanjay Raut: పోరాటం చేసి అసలు వాస్తవాలు ఏమిటో ప్రజలకు తెలియజేస్తా

ఈ సందర్భంగా ఈడీ చర్యలపై సంజయ్ రౌత్ స్పందించారు. ఇలాంటి వాటికి తాను భయపడే ప్రసక్తిలేదని సంజయ్ రౌత్ అన్నారు. తన ఆస్తులను సీజ్ చేసినా, జైలుకు పంపినా, తుపాకీతో కాల్చినా భయపడే వాడిని కాదన్నారు. తాను బాలాసాబెహ్ ఠాక్రే ఫాలోవర్‌ను, శివ సైనికుడిని అని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. దీనిపై పోరాటం చేసి అసలు వాస్తవాలు ఏమిటో ప్రజలకు తెలియజేస్తానని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని ఆయన అన్నారు.

Related posts

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!