NewsOrbit
Andhra Pradesh Telugu News ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు వ్యాఖ్య

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

TDP ChandraBabu:  విజయవాడ, Andhra: ఏపీలో టీడీపీ పరిస్థితి దారుణంగా ఉందన్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల దెబ్బ నాటినుండి ఏపీలో జరుగుతున్న ప్రతి ఎన్నికలలో..టీడీపీ చిత్తుచిత్తుగా ఓడిపోతూనే వస్తోంది.. ప్రతిపక్ష పాత్ర ఏ మాత్రం పోషించలేని పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో టీడీపీ కార్యకర్తలు కూడా ప్రభుత్వ పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి నిరసనలు లేదా సోషల్ మీడియాలో ఫేక్ ప్రసారం చేసిన.. వెంటనే వైసీపీ ప్రభుత్వం చర్యలు.. తీసుకుంటూనే మరోపక్క కేసులు పెడుతున్న సంగతి తెలిసిందే. దీంతో టీడీపీ క్యాడర్ చాలావరకు భయాందోళనలో ఉంది. మరోపక్క అధినేత తీరు మాత్రం చాలా వెరైటీ గా ఉందని అంటున్నారు. పార్టీ కార్యకర్తలపై కేసులు వైసీపీ పెడుతూ ఉంటే మరోపక్క చంద్రబాబు తాజాగా రాష్ట్రంలో పర్యటిస్తున్న క్రమంలో ఆయన చేస్తున్న కామెంట్లు మరీ విడ్డూరంగా ఉన్నాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. in cases issue TDP cadre .. Babu, Lokesh impatient with the trend

ఇటీవల శ్రీకాకుళం అదేవిధంగా భీమిలిలో పర్యటించిన సమయంలో పార్టీ అధినేత చంద్రబాబు.. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. మీ మీద ఎన్ని కేసులు ఉంటే.. అంత బాగా మిమ్మల్ని ప్రోత్సహిస్తాము. తర్వాత మన  ప్రభుత్వం వచ్చాక ఆ కేసులు వేసిన వారి మీద ట్రిబ్యునల్ వేసి…తిరిగి వాళ్ళమీద కేసులు పెడతాం.. అని చెప్పారు. దీంతో బాబు గారి మాటలు కార్యకర్తలకి ధైర్యం చెప్పడానికా..? లేకపోతే.. ఆయన పొలిటికల్ మైలేజ్ కోసం వాళ్లని బలిపశువులు.. చేయడానికా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే సందర్భంలో ప్రభుత్వపరంగా కేసులు ఎదుర్కొంటున్న కొంతమంది టీడీపీ కార్యకర్తలు ఇటీవల నారా లోకేష్ నీ కలిసిన సమయంలో .. కేసుల ప్రస్తావన తీసుకొచ్చిన క్రమంలో లోకేష్ కూడా వెరైటీ గా రియాక్ట్ అయ్యారు అని పార్టీ వర్గాల్లో టాక్. లోకేష్ పార్టీ కార్యకర్తలపై కేసులు గురుంచి మాట్లాడుతూ …మీ కేసులు ఏమోగానీ నాపై 11 కేసులు ఉన్నాయి.. అని బదులిచ్చారు అంట. in cases issue TDP cadre .. Babu, Lokesh impatient with the trend

దీంతో ఆ కార్యకర్తలు అంతర్మథనంలో పడినట్లు టాక్. వాళ్లు మాత్రమే కాదు ఏపీ టీడీపీ క్యాడర్ చాలావరకూ ఈ రీతిగానే  ఆలోచన చేస్తున్నట్లు విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. మేటర్ లోకి వెళ్తే చంద్రబాబు, లోకేష్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళకి లీగల్ సెల్ ఉండటం మాత్రమే కాదు వాళ్ళ వెనకాల కొన్ని కోట్లు ఆస్తులు ఉంటాయి. కానీ కార్యకర్త అనేసరికి చిన్నపాటి ఉద్యోగం.. చేసుకుంటూనే మరోపక్క పార్టీ కోసం పని చేసే పరిస్థితి. ఇటువంటి తరుణంలో చంద్రబాబు లోకేష్ కార్యకర్తలను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంటే వాళ్ళని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం మాత్రమే కాదు కేసులు ఎక్కువ.. ఉంటే అంత మంచిదని.. వ్యాఖ్యలు చేయటం టీడీపీకే డామేజ్ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కార్యకర్త పై కేసు అనేసరికి…కోర్టులు చుట్టూ తిరిగే పరిస్థితి ఉంటది. ఒక కేసులో ఇరుక్కున్నారు అంటే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాలి. ఈ క్రమంలో కేసు ఎదుర్కొన్న వ్యక్తి పై ఆధారపడిన కుటుంబం కూడా అన్ని రకాలుగా నలిగిపోయే పరిస్థితి ఉంటది. దీంతో ఇప్పుడు టీడీపీకి బలం అని చెప్పుకునే క్యాడర్.. పార్టీ కార్యకర్తలకి సంబంధించి కేసులపై బాబు, లోకేష్ తీరుపై అసహనం చెందుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?