Raviteja: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలా మంది హీరోలు కొత్తగా వచ్చిన దర్శకులతో పని చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సీనియర్ హీరోలు చిరంజీవి ,బాలకృష్ణ మొదలుకుని ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలు వరకు అందరూ ఎక్కువ శాతం కొత్త దర్శకులకు అవకాశం కల్పిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే క్రాక్ సినిమాకి ముందు వరుస ఫ్లాపులు అందుకున్న రవితేజ..”క్రాక్” తర్వాత “కిలాడి” సినిమా అట్టర్ ఫ్లాప్ కావడం తెలిసిందే.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ప్రస్తుతం రవితేజ చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. షూటింగ్ దశలో టైగర్ నాగేశ్వరరావు, ధమాకా, రావణాసుర సినిమాలు ఉన్నాయి. ఈ మూడింటిలో “టైగర్ నాగేశ్వరరావు” సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వాస్తవానికి జూన్ 17 వ తారీకు “రామారావ్ ఆన్ డ్యూటీ” సినిమా విడుదల కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు పక్కన పెట్టేశారు. ఇటువంటి తరుణంలో తాజాగా రవితేజ మరో యంగ్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఆ డైరెక్టర్ మరెవరో కాదు యాంకర్ ప్రదీప్ ని హీరోగా పెట్టి “30 రోజుల్లో ప్రేమించడం ఎలా..?” సినిమా తెరకెక్కించిన మున్నాతో.. పని చేసే ఆలోచనలో రవితేజ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో రవితేజ చాలా మంది కొత్త దర్శకులు ఇండస్ట్రీకి పరిచయం చేయడం తెలిసిందే. అంతమాత్రమే కాదు రెండు మూడు సినిమాలు చేసిన దర్శకులతో కూడా రవితేజ సినిమాలు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కోవలోనే మున్నా తో సినిమా చేయడానికి.. రవితేజ పచ్చజెండా ఊపినట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది.
Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!