NewsOrbit
జాతీయం న్యూస్

Presidential Poll: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన ద్రౌపది ముర్ము… నామినేషన్ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొన్నారంటే..

Presidential Poll: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధిగా జార్ఖండ్ మాజీ గవర్నర్, బీజేపీ నేత ద్రౌపది ముర్ము నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా, వైసీపీ తరపున ఎంపీ విజయసాయిరెడ్డి పలువురు బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు ఈ కార్యక్రమానికి హజరైయ్యారు. ద్రౌపది ముర్ము అభ్యర్ధిత్వాన్ని ముందుగా ప్రధాన మంత్రి మోడీ ప్రతిపాదించారు. నామినేషన్ పత్రాలపై మోడీతో సహా అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జేపి నడ్డా సంతకాలు చేశారు. తొలుత పార్లమెంట్ ఆవరణలోని మహత్మా గాంధీ, బీఆర్ అంబేద్కర్, మిస్రా ముండా విగ్రహాల వద్ద ద్రౌపది ముర్ము నివాళులర్పించారు.

Presidential Poll Droupadi Murmu filed her nomination
Presidential Poll Droupadi Murmu filed her nomination

ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా బీజేపీ మాజీ నేత యశ్వంత్ సిన్హా ఈ నెల 27వ తేదీన నామినేషన్ వేయనున్న సంగతి తెలిసిందే. ద్రౌపది ముర్ము అభ్యర్ధిత్వాన్ని బీజూ జనతాదళ్ (బీజేడీ) , వైసీపీ సైతం మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ పక్షాలకు తోడుగా బీజేడీ, వైసీపీ మద్దతుగా నిలవడంతో ద్రౌపది ముర్ము విజయం లాంఛన ప్రాయమే అన్నది అందరికీ తెలిసిందే. ఎలక్టోరల్ కాలేజీ లో మొత్తం 10,86.431 ఓట్లకు గానూ ఎన్ డీ ఏ కి 5,32,351 ఓట్లు ఉన్నాయి. వైసీపీకి చెందిన ఓట్లు 45,550, బీజేడీకి చెందిన 31,686 ఓట్లతో పాటు అన్నా డీఎంకే కు చెందిన 14,940 ఓట్లు ముర్ముకే పడనున్నాయి. ముర్ము రాష్ట్రపతి స్థానాన్ని అలంకరించే తొలి గిరిజన మహిళయే కాక చిన్న వయస్సులోనే (64) రాష్ట్రపతిగా ఎన్నికై చరిత్ర సృష్టించనున్నారు.

Related posts

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju