పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ఇటు సినిమాలు, అటు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం పవన్‌కు క్షణం తీరిక లేదు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో చావోరేవో తేల్చుకునేందుకు పవన్ సిద్ధంగా ఉన్నాడు. మరోవైపు వరుసగా సినిమాలను కూడా లైన్లో పెట్టాడు. ఈ యేడాది భీమ్లానాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ చేతిలో ప్రస్తుతం హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్‌సింగ్, వినోదయ సీతం రీమేక్‌లు ఉన్నాయి. ఇదిలా ఉంటే పవన్‌కు హైదరాబాద్ అవుట్ కట్స్‌లో రంగారెడ్డి జిల్లా పరిధిలో 16 ఎకరాల ఖరీదైన తోట ఉంది.
ఈ తోటలోనే పవన్ సేద్యం చేస్తున్నాడు. అక్కడే ఆవులు ఉంటాయి. అక్కడే మామిడి పండ్లతో పాటు రకరకాల కూరగాయలు పండిస్తాడు. ఇక్కడ పశుపోషణతో పాటు ఆర్గానిక్ ఫామింగ్ కూడా ఎక్కువుగా నడుస్తూ ఉంటుంది. పవన్ చాలా ఏళ్ల క్రితమే ఈ భూమిని కొన్నాడు. ఈ భూమి విలువే ఎకరా రు. 10 కోట్లు ఉంటుంది. అంటే మొత్తం 16 ఎకరాల విలువ రు. 160 కోట్లు. ఇక్కడే పవన్‌కు మంచి ఇళ్లు కూడా ఉంది. అయితే ఇప్పుడు పవన్ ఈ ఇంటిని కూలగొట్టించేశాడు.
మహేశ్, పవన్, ఎన్టీఆర్‌లపై `భీమ్లా` బ్యూటీ ఇంట్రస్టింగ్ కామెంట్స్!
ఇక్కడే ఇదే ప్లేసులో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన పెద్ద ఫామ్‌హౌస్‌ను నిర్మిస్తున్నాడు. ఇప్పుడు ఉన్న ఇళ్లు చిన్నది కావడంతో.. అత్యాధునికంగా ఇప్పుడు పెద్దగా ఉండేలా కొత్త ఫామ్ హౌస్ కట్టుకుంటున్నాడు. ఓ ప్రముఖ ఆర్కిటెక్ సంస్థ ఆధ్వర్యంలో దీని నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కళ్లు చెదిరే రేంజ్లో ఈ ఫామ్‌హౌస్ నిర్మాణం జరుగుతుందట. పవన్‌కు కాస్త రెస్ట్ కావాలని అనుకుంటే ఇక్కడే సేదతీరుతూ ఉంటాడు. మరో 10 నెలల్లో ఈ ఇంటి నిర్మాణ పనులు పూర్తి కానున్నాయి.
ఇక పవన్ అటు ఏపీలో రాజకీయాలు చేస్తుండడంతో విజయవాడ – గుంటూరు మధ్యలో కూడా మరో ఇంటిని నిర్మించుకుంటోన్న సంగతి తెలిసిందే. ఇక పవన్ భార్య అన్నా లెజ్నోవా ప్రస్తుతం సింగపూర్‌లో ఉంటున్నారు. ఆమె అక్కడే ఉంటూ తన ఇద్దరు పిల్లలను అక్కడే చదివించుకుంటోన్న సంగతి తెలిసిందే.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!