NewsOrbit
రాజ‌కీయాలు

‘పోలవరంపై సమీక్ష.. వైసిపి విమర్శ’

అమరావతి: జులైలో పోలవరం నుంచి నీటి విడుదలకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.  కుడి, ఎడమ ప్రధాన కాల్వ పనులు పూర్తి చేయాలని సూచించారు. చంద్రబాబు బుధవారం పోలవరం పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా అధికారులు ప్రాజెక్ట్‌ పురోగతిని చంద్రబాబుకు వివరించారు. ఇప్పటి వరకు ప్రాజెక్టు నిర్మాణం 69 శాతం, కాంక్రీట్ పనులు 72.40 శాతంతో  28.16 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. తవ్వకం పనులు 84.60 శాతం పూర్తయ్యాయని, కుడి ప్రధాన కాల్వ పనులు 90.87 శాతం, ఎడమ ప్రధాన కాల్వ పనులు 70.38 శాతం పూర్తయ్యాయయని తెలిపారు. రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ పనులు 66.22 శాతం, ఎగువ కాఫర్ డ్యామ్ పనులు 40.71 శాతం, దిగువ కాఫర్ డ్యామ్ పనులు 25.04 శాతం పూర్తయినట్టు అధికారులు చంద్రబాబుకు వివరించారు.

ఎన్నికల అనంతరం పోలవరం పనులపై సమీక్షించడం ఇదే తొలిసారి. మొత్తంగా ఇప్పటి వరకూ 90 సార్లు చంద్రబాబు పోలవరం పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఇదిలా ఉంటే చంద్రబాబు సమీక్ష నిర్వహించడంపై వైసిపి విమర్శలు చేసింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఎలా సమీక్ష నిర్వహిస్తారని వైసిపి నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు. రావాల్సిన కమీషన్ల కోసమే సమీక్షలు నిర్వహించారని ఆయన ఆరోపించారు.

Related posts

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

Leave a Comment