NewsOrbit
తెలంగాణ‌ రాజ‌కీయాలు

Mungode Bypoll 2022: మునుగోడు ఉప ఎన్నికలలో కేసిఆర్ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టిన ఆర్టీసీ కార్మికులు..!!

TSRTC Employees Munugode Bypoll

Mungode Bypoll 2022: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మునుగోడు ఉప ఎన్నిక కీలకంగా మారింది. సరిగ్గా వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఉప ఎన్నిక కావడంతో ప్రధాన పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్ లు వేయడం జరిగింది. ఈ ఉప ఎన్నికలలో భాగంగా ప్రధాన పార్టీలు సీనియర్ నేతలను రంగంలోకి దింపి ప్రచారం చేయిస్తున్నాయి. బీజేపీ నుండి కేంద్ర మంత్రులు సీనియర్ నేతలు ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. సహా కీలక నేతలు నియోజకవర్గ నాయకులు.. రోడ్డు షో ద్వారా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో అన్నివార్యమైన ఈ ఉప ఎన్నికలో గెలుపు కోసం ప్రధాన పార్టీలు అన్ని రకాల వ్యూహాలతో ముందుకు వెళుతూ ఉన్నాయి.

Tsrtc trade union leaders demand kcr governament to fullfill promises
Mungode By Poll

అంతకముందు రాష్టంలో జరిగిన దుబ్బాక, హుజారాబాద్ ఉప ఎన్నికలు ఓడిపోవడంతో ..ఈ ఉప ఎన్నికలను అధికార పార్టీ టిఆర్ఎస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో టిఆర్ఎస్ పార్టీ ఎలాగైనా ఈ ఉప ఎన్నికలలో గెలవడానికి తీవ్రంగా కృషి చేస్తూ ఉంది. పరిస్థితి ఇలా ఉంటే సరిగ్గా ఉపఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మిక సంఘాలు తమ డిమాండ్లను తెరపైకి తీసుకువచ్చి అధికార పార్టీ టిఆర్ఎస్ నీ ఇరుకున పెట్టడం జరిగింది. పూర్తి విషయంలోకి వెళ్తే నియోజకవర్గంలో దాదాపు ఆర్టీసీ కార్మికులు ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులకి మొత్తం కలిపి ఏడు వేలకు పైగానే ఓట్లు ఉండటంతో… సరైన టైంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుక్కున్న పెట్టే దిశగా “మునుగోడు నియోజకవర్గ ఆర్టీసీ ఉద్యోగుల సమైక్య” నాయకులు వ్యవహరించారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తమ డిమాండ్లను ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు తెరపైకి తీసుకొచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం గతంలో తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. ముఖ్యంగా 2017 నుండి 2021 వరకు పెండింగ్ లో ఉన్న సరైన వేతన సవరణలు మంజూరు చేయాలని డిమాండ్ల  లిస్ట్ విడుదల చేయడం జరిగింది.

TSRTC ఉద్యోగుల డిమాండ్లు :

1-4-2017 మరియు 1-4-2021 తేదీల్లో పెండింగ్‌లో ఉన్న రెండు వేతన సవరణలను మంజూరు చేయలి.

2020 నుండి పెండింగ్‌లో ఉన్న 5 డీఏలను మంజూరు చేయలి.

అప్పట్లో ఇచ్చిన హామీ 8.75% వడ్డీతో పెండింగ్‌లో ఉన్న బకాయి బాండ్ (2013) కోసం నిధులను విడుదల చేయలి.

TSRTCలో 2019లో నిషేధించబడిన ఉద్యోగుల సంఘాలను పునరుద్ధరించలి.

TSRTCని లాభదాయకంగా మార్చే లక్ష్యంతో లక్ష్యాలను చేరుకోవడానికి అదనపు పని గంటలు మరియు నిర్వహణ నుండి ఒత్తిడిని భర్తీ చేయలి.

ఉద్యమాన్ని విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించిన TSRTC ఉద్యోగుల కోసం సకల జనుల సమ్మేళనం సందర్భంగా పెండింగ్‌లో ఉన్న వాగ్దానాలను పునఃపరిశీలించలి.

Tsrtc trade union leaders demand kcr governament to fullfill promises
Mungode By Poll

2019వ సంవత్సరంలో 55 రోజులపాటు ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం సుదీర్ఘకాలం సమ్మె నిర్వహించారు. ఆ సమ్మె జరుగుతున్న సమయంలో 38 మంది మరణించడం జరిగింది. అయినా గాని కెసిఆర్ ప్రభుత్వంలో కదలిక రాలేదు. అదే సమయంలో కార్మిక సంఘాలను ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. దీంతో అప్పటినుండి యూనియన్ ల మనుగడ పునరుద్ధరించాలని గుర్తింపు యూనియన్ ఎన్నికలు నిర్వహించాలని కార్మిక నేతలు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో టిఆర్ఎస్ మంత్రులను కలవడానికి అపాయింట్మెంట్ ప్రయత్నించిన ఎవరికి దొరకలేదు. పెండింగ్ లో ఉన్న వేతన సవరణ, డిఏ బకాయిలు, గత వేతన సవరణ బాండ్ల బకాయిలు, సకల జనుల సమ్మె కాలం బకాయిలు, ఇతర దీర్ఘకాలిక డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చించటానికి.. టిఆర్ఎస్ ఆర్టిసి ఉద్యోగ సంఘాలు ప్రయత్నాలు చేసినా ఎటువంటి ప్రయోజనం దొరకలేదు.

Tsrtc trade union leaders demand kcr governament to fullfill promises
Mungode By Poll
2022 తెలంగాణ బడ్జెట్ దాదాపు రెండు లక్షల కోట్లు.

దీంతో మునుగోడు ఉప ఎన్నిక రావటం ఈ ఉప ఎన్నికలలో దాదాపు 7వేలకు పైగా ఓట్లు ఉండటంతో “మునుగోడు నియోజకవర్గ ఆర్టీసీ ఉద్యోగుల సమైక్య” పేరుతో ఆర్టీసీ ఉద్యోగస్తులు ఉద్యమిస్తున్న సమయంలో.. దాదాపు రెండున్నర సుదీర్ఘకాల విరామం తర్వాత ఆర్టీసీ సంఘ నాయకులతో టిఆర్ఎస్ మంత్రులు చర్చలకు రావటం జరిగింది. ఈ సందర్భంగా తమ డిమాండ్లను తెరపైకి తీసుకొచ్చి వెంటనే ప్రభుత్వం అమలు చేయాలని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది తెలంగాణ బడ్జెట్ దాదాపు రెండు లక్షల కోట్లు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ రంగాలకు సంబంధించి అనేక ప్రోత్సాహకాలు కల్పిస్తున్నారు. ఇలాంటి తరుణంలో తమ డిమాండ్లను పరిష్కరించటం ప్రభుత్వానికి పెద్ద సమస్య ఏమి కాదు అంటూ.. మునుగోడు ఉప ఎన్నిక ఆర్టీసీ కార్మిక సంఘ నేతలు అంటున్నారు. ముఖ్యంగా మహమ్మారి వచ్చిన తర్వాత.. పరిస్థితులు మొత్తం మారిపోవటంతో తమ కుటుంబాన్ని పోషించుకోవడం చాలా కష్టంగా ఉందని ఆర్టీసీ కార్మికులు తమ బాధను వెల్లబుచ్చుకుంటున్నారు.

తమ జేబులో నుంచి 2000 రూపాయలు…

ఇలాంటి తరుణంలో తమ సమస్యలను ఈ ఉపఎన్నిక వేదికగా ప్రధాన పార్టీలకు తెలియజేయడానికి ప్రతి కార్మికుడు తమ జేబులో నుంచి 2000 రూపాయలు “మునుగోడు నియోజకవర్గ ఆర్టీసీ ఉద్యోగుల సమైక్య” కి ఇచ్చి సమావేశాలకు సహకరిస్తున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతున్నారు. ప్రస్తుతం బీజేపీ పార్టీ అభ్యర్థిగా ఈ ఉపఎన్నికలలో పోటీ చేయబోతున్న కే.రాజగోపాల్ రెడ్డి 2018 ఎన్నికలలో దాదాపు 99,239 ఓట్లతో గెలవడం జరిగింది. అటువంటి బలమైన అభ్యర్థిని టిఆర్ఎస్ పార్టీ ఓడించాలంటే కచ్చితంగా TSRTC ఎంప్లాయిస్ హామీలను నెరవేర్చే దిశగా అడుగులేస్తే టిఆర్ఎస్ పార్టీకి లాభం ఉంటుందని రాజకీయ మేధావులు అంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలనే ఆర్టీసీ ఉద్యోగులు కోరుతూ ఉన్నారు. ఈ విషయంలో కెసిఆర్ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే.. ఈ ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందని అంటున్నారు. మరి టిఆర్ఎస్… ఆర్టీసీ డిమాండ్లపై ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక మంత్రులు కేటీఆర్ మరియు హరీష్ ఇంకా జగదీశ్వర్ రెడ్డి.. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో చర్చలు జరపడం జరిగింది. ఏది ఏమైనా జరుగుతున్న చర్చలలో ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరిస్తే చాలు అన్న రీతిలో మునుగోడు నియోజకవర్గ ఆర్టీసీ ఉద్యోగ సమైక్య నాయకులంటున్నారు.

Related posts

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju