Adipurush: బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన “ఆదిపురుష్” జనవరి 12వ తారీకు విడుదల కానున్న సంగతి తెలిసిందే. రామాయణం కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించడంతో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల దసరా పండుగ సందర్భంగా రాముని జన్మ స్థలం అయోధ్యలో అక్టోబర్ మూడవ తారీకు “ఆదిపురుష్” టీజర్ రిలీజ్ చేశారు. కాగా టీజర్ యానిమేషన్ తరహాలో గ్రాఫిక్స్ ఉండటంతో అభిమానులు ఎంతో నిరుత్సాహం చెందారు.
కానీ సినిమా త్రీడీలో వెండితెరపై చాలా అద్భుతంగా ఉంటుందని నిర్మాతలు మరియు దర్శకుడు తెలియజేయడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే అక్టోబర్ 23వ తారీకు ప్రభాస్ పుట్టిన రోజు నేపథ్యంలో “ఆదిపురుష్” నుండి మరో సర్ప్రైజ్ అభిమానులకు అందించడానికి సినిమా యూనిట్ రెడీ అయినట్లు సమాచారం. విషయంలోకి వెళ్తే “ఆదిపురుష్” ఫస్ట్ సింగల్ సాంగ్ ప్రభాస్ పుట్టినరోజు నాడు విడుదల చేయడానికి రెడీ అయ్యారట. టీజర్ తో ఆకట్టుకోకపోయినా గానీ.. సాంగ్ తో ఏ మేరకు ఆకట్టుకుంటారో అన్నది అభిమానులలో టెన్షన్ నెలకొంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో సీత పాత్ర చేసిన కృతి సనన్… ఇప్పటికే డబ్బింగ్ స్టార్ట్ చేయడం జరిగింది.
చాలావరకు సినిమా ఫినిషింగ్ టచ్ లో ఉంది. నవంబర్ నెల రెండో వారం నుండి “ఆదిపురుష్” ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు టాక్. ఇక ఇదే సమయంలో ప్రభాస్ జన్మదిన నాడు సలార్, ప్రాజెక్టుకే ఇంక మారుతి సినిమాలకు సంబంధించి అప్ డేట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఏది ఏమైనా వచ్చే ఏడాదిలో మాత్రం ప్రభాస్ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!