NewsOrbit
Entertainment News సినిమా

`గాడ్ ఫాద‌ర్‌` 10 డేస్ క‌లెక్ష‌న్స్‌.. ఇంకా చిరు టార్గెట్‌ను రీచ్ కాలేదుగా!

మెగాస్టార్ చిరంజీవి, త‌మిళ ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `గాడ్ ఫాద‌ర్‌`. మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ `లూసిఫ‌ర్‌`కు రీమేక్ గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఇందులో న‌య‌న‌తార, సల్మాన్ ఖాన్, సత్యదేవ్, సముద్రఖని, సునీల్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

తెలుగు ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయ్యే విధంగా ప‌లు మార్పులు, చేర్పులు చేసి గాడ్ ఫాద‌ర్‌ను రూపొందించ‌గా.. ద‌స‌రా పండుగ కానుక‌గా విడుద‌లైన ఈ పొలిటిక‌ల్‌ డ్రామాకు మంచి స్పంద‌న ల‌భించింది. టాక్ బాగుండ‌టంతో వీకెండ్ వ‌ర‌కు బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన ఈ చిత్రం.. వ‌ర్కింగ్ డేస్‌లోకి ఎంట‌ర్ అవ్వ‌గానే వీక్ అయిపోయింది.

chiranjeevi godfather movie
chiranjeevi godfather movie

అయితే రెండో వారంలో ఈ చిత్రం కాస్త గ్రోత్‌ను చూపించింది. విడుద‌లైన 10వ రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 41 ల‌క్ష‌ల‌ షేర్ ని రాబ‌ట్టిన ఈ సినిమా.. వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 62 లక్షల షేర్ ని అందుకుంది. ఇక ఏరియాల వారీగా గాడ్ ఫాద‌ర్ 10 డేస్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్‌ను ఓ సారి గ‌మ‌నిస్తే..

నైజాం: 11.88 కోట్లు
సీడెడ్: 9.20 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 5.56 కోట్లు
తూర్పు: 3.58 కోట్లు
పశ్చిమ: 2.20 కోట్లు
గుంటూరు: 3.82 కోట్లు
కృష్ణ: 2.61 కోట్లు
నెల్లూరు: 1.95 కోట్లు
————————————-
ఏపీ+తెలంగాణ‌= 40.80 కోట్లు(67.10 కోట్లు~ గ్రాస్)
————————————-

క‌ర్ణాట‌క‌: 4.58 కోట్లు
హిందీ+రెస్టాఫ్ ఇండియా: 4.80 కోట్లు
ఓవ‌ర్సీస్‌: 4.97 కోట్లు
——————————————
టోటల్ వరల్డ్ వైడ్ = 55.15 కోట్లు(100.25 కోట్లు~ గ్రాస్)
——————————————

కాగా, రూ. 74 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన ఈ చిత్రం.. ప‌ది రోజుల్లో రూ. 55.15 కోట్ల షేర్‌ను మాత్ర‌మే రాబ‌ట్టింది. అంటే చిరు ఇంకా త‌న టార్గెట్‌ను రీచ్ కాలేదు. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద క్లీన్ హిట్‌గా నిల‌వాలంటే ఇంకా రూ. 18.85 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంది.

 

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N