NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

TRS MLAs poaching case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి

TRS MLAs poaching case:  టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితులకు ఏసీబీ కోర్టు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కొద్ది సేపటి క్రితం 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో వారిని చంచల్ గూడ జైలుకు తరలించారు. హైకోర్టు ఆదేశాలతో సైబరాబాద్ పోలీసులు నిందితులు రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజీలను ఈ మధ్యాహ్నం మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించి మరో సారి వాంగ్మూలం సేకరించారు. అనంతరం ముగ్గురు నిందితులకు చేవెళ్ల ఏరియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహింపజేసి ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుట హజరుపర్చారు. ఈ సందర్భంలో నిందితుల తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించి రిమాండ్ తరలింపు ఆపాలని కోరారు. నిందితుల తరపు న్యాయవాదుల వాదనలు తోసిపుచ్చిన న్యాయమూర్తి వారికి 14 రోజులు అంటే నవంబర్ 11 వ తేదీ వరకూ రిమాండ్ ఆదేశించారు. దీంతో వారిని చంచల్ గూడ జైలుకు పోలీసులు తరలించారు.

Ramachandra Bharati

 

నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేశారన్న అభియోగంపై మొయినాబాద్ ఫామ్ హౌస్ నందు నిందితులను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తొలుత మొన్న రాత్రి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి వద్ద పోలీసులు హజరుపర్చగా నిందితుల అరెస్టుకు ముందు సీఆర్పీసీ 41 నోటీసులు ఇవ్వలేదన్న కారణంగా రిమాండ్ రిపోర్టును తిరస్కరించారు. దీంతో పోలీసులు వారికి 41 ఏ నోటీసులు ఇచ్చి పంపించారు. తదుపరి ఈ రోజు సైబరాబాద్ పోలీసులు ఏసీబీ కోర్టు రిమాండ్ రిపోర్టు తిరస్కరించడాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఏసీబీ కోర్టు తీర్పును సస్పెండ్ చేసి రిమాండ్ కు తరలించడానికి ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ రోజు మరో సారి అరెస్టు చేసి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సమక్షంలో హజరుపర్చారు.

Nanda Kumar

మరో పక్క ఇదే కేసును సీట్ లేదా సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ పోలీసు విచారణను నవంబర్ 4వ తేదీ వరకూ నిలుపుదల చేస్తూ స్టే విధించింది.

Related posts

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju