నేచురల్‌స్టార్ నాని, శ్రద్ధాశ్రీనాథ్ జంటగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన చిత్రం ‘జెర్సీ’. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 19న విడుదలైంది. తొలి ఆట నుండే ఇటు ప్రేక్షకులను, అటు విమర్శకులను కూడా మెప్పిస్తూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ జెర్సీ కలెక్షన్స్ చాలా బావున్నాయి. యు.ఎస్‌లో జెర్సీ మంగళవారంతో వన్ మిలియన్ డాలర్స్‌ను కలెక్ట్ చేసింది. ఓవర్సీస్లో నాని సినిమాలు వన్ మిలియన్ డాలర్స్‌ను కలెక్ట్ చేయడం ఇదేమీ కొత్తకాదు. జెర్సీతో నాని ఈ రికార్డ్‌ను ఆరోసారి అందుకున్నాడు. నాని కెరీర్లో భలే భలే మగాడివోయ్ చిత్రం 1.42 మిలియన్ డాలర్స్‌ను వసూలు చేసి టాప్‌గా ఉంది. మరి జెర్సీ దాన్ని క్రాస్ చేస్తుందో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
previous post
next post
Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!