NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Chandrababu: బాబుకు చేరిన ప్రముఖ పత్రిక సర్వే..! టీడీపీకి ఎన్ని సీట్లు..? లిస్ట్..!

Chandrababu: ఏపిలో రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. ఒక వేళ ముందస్తు వస్తే అసెంబ్లీ ఎన్నికలు ఏడాదిలో జరుగుతాయి. ముందస్తు లేదు అనుకుంటే షెడ్యూల్ ప్రకారం ఏడాదిన్నర ఎన్నికలకు సమయం ఉంది. అయితే రాజకీయ పార్టీలు పొలిటికల్ సీజన్ ప్రారంభం అయినట్లుగా భావించి ఎవరికి వారు యాక్టివ్ అవుతున్నారు. ప్రజల్లోకి వెళ్లడానికి రెడీ అవుతున్నారు. నారా లోకేష్ జనవరి 27 నుండి పాదయాత్రకు ప్లాన్ చేసుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే నెల నుండి బస్సు యాత్ర చేయనున్నారు. మరో వైపు వైసీపీ మే నెల నుండే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పేరుతో ప్రజల్లోకి వెళుతోంది. ఇలా పార్టీలు అన్నీ ప్రజల్లోకి వెళుతున్నాయి. ఎన్నికల సీజన్ అంటే సర్వేలు, ఇంటెలిజెన్స్ రిపోర్టులు, అంతర్గత రిపోర్టులు వస్తుంటాయి. ఇప్పుడు సర్వే రిపోర్టులు మొదలు అయ్యాయి.

 

Chandrababu: పొలిటికల్ సర్వేలకు ఈనాడు దూరం

తాజాగా ఒక ప్రముఖ పత్రిక ‘ఈనాడు’ ఒక సర్వే చేసిందనీ, చంద్రబాబు మూడు రోజుల క్రితం ఈనాడు అధినేత రామోజీతో భేటీ అయిన సమయంలో ఈ సర్వే రిపోర్టు ఆయనకు ఇచ్చారనీ ప్రచారం జరుగుతోంది. అయితే ఇది నిజమా..? కాదా ? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది..! సాధారణంగా ‘ఈనాడు’ ఎటువంటి సర్వే చేయదు. ఈనాడు సంస్థ రాజకీయ సర్వేలు ఏమీ చేపట్టదు. కానీ అభిప్రాయాలు చెబుతారు. ఫీడ్ బ్యాగ్ ఇస్తారు. అంతర్గతంగా ఏమి జరుగుతుంది..? ఎలా సెట్ చేసుకోవాలి..? ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి..? అనే విషయాలపై ఫీడ్ బ్యాక్ ఇస్తారు. అంతే గానీ ఈ నియోజకవర్గంలో ఇంత పర్సంటేజ్ ప్లస్ ఉంది, లేదా మైనస్ ఉందని చెప్పరు. ఈ నియోజకవర్గంలో గెలుస్తారు. ఈ నియోజకవర్గంలో ఓడిపోతారు అనే వివరాలను ఇవ్వరు. సర్వేలు గతంలోనూ ‘ఈనాడు’ చేయలేదు. అయితే మూడు నాలుగు నెలలకు ఒక సారి ఏ నియోజకవర్గంలో ఎలా ఉంది అనే దానిపై ఫీడ్ బ్యాగ్ తీసుకుంటుంటారు. ఇదే చాలా కీలకం. ఇది రామోజీ చంద్రబాబుకు చెప్పారు అని ప్రచారం జరుగుతోంది..!

జనసేన – టీడీపీ కలిసి పోటీ చేస్తే..

ఈ లెక్క ప్రకారం టీడీపీ ప్రభుత్వం వచ్చే చాన్స్ ఉందా ..? లేదా..? వైసీపీ ఓడిపోతుందా..? లేదా మళ్లీ జగన్మోహనరెడ్డే సీఎం అవుతారా..? అసలు ఈనాడు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఎలా ఉందని అంటున్నారు అంటే..? జనసేన – టీడీపీ కలిసి పోటీ చేస్తే కాస్త సానుకూలత కనిపిస్తొందనేది వీళ్ల ఫీడ్ బ్యాక్ లో ఉందట. ముఖ్యంగా విశాఖ జిల్లా నుండి ప్రకాశం జిల్లా వరకూ..విశాఖ, ఉభయ గోదావరి, ప్రకాశం, గుంటూరు, కృష్ణా ఉమ్మడి జిల్లాలతో పాటు అనంతపురం జిల్లాల్లో టీడీపీకి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉందనీ, జనసేనతో పొత్తు ఉంటే కొన్ని జిల్లాల్లో స్పీప్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయనీ, కొన్ని పార్లమెంట్ స్థానాలు పూర్తిగా స్పీప్ చేసే అవకాశాలు ఉన్నాయట. మిగిలిన జిల్లాల్లో మాత్రం పార్టీ అప్రమత్తంగా ఉండాలి అన్నట్లుగా ఫీడ్ బ్యాక్ ఉందట. రాయలసీమ పరిధిలోని మూడు జిల్లాలు. నెల్లూరు. విజయనగరం జిల్లాల్లో గతంలో ఉన్న చేదు అనుభవాలే ఉన్నాయనీ, అక్కడ పార్టీ పరిస్థితులు మెరుగుపడలేదు అని చెప్పారుట. అయితే పొత్తు లేకపోతే టీడీపీకి కష్టమే అని సంకేతాలు ఇచ్చారుట.

 

కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఓట్ల చీలికను ఆపలేరు. గతంతో పోలిస్తే పవన్ కళ్యాణ్ (జనసేన) బలం పెరిగిందని సమాచారం. దీని వల్ల ఓట్ల చీలిక పెరుగుతుందనీ, గతంలో 25 నియోజకవర్గాల్లో ఆ ప్రభావం ఉండగా, ఈ సారి 35 కు పైగా నియోజకవర్గాల్లో ఆ ప్రభావం ఉంటుందని ఫీడ్ బ్యాక్ ఇచ్చారుట. పొత్తు లేకపోతే 30 నుండి 35 స్థానాలు కోల్పోయినట్లేనని అంటున్నారుట. పొత్తుతో వెళితేనే సానుకూలంగా ఉంటుంది అన్నట్లుగా ఫీడ్ బ్యాక్ ఉందట. అయితే ఈ సమాచారాన్ని కఛ్చితంగా దృవీకరించే పరిస్థితి అయితే లేదు. రామోజీ, చంద్రబాబు మధ్య జరిగిన భేటీలో ఏమి జరిగింది అనేది వాళ్లకు మాత్రమే తెలుసు. అయితే ఈనాడుకు మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకూ రిపోర్టర్ల వ్యవస్థ ఉండటం వల్ల గతంలోనూ సేకరించిన ప్రజాభిప్రాయాలను చంద్రబాబుకు ఇస్తుండే వాళ్లు. ఇప్పుడు కూడా అదే మాదిరిగా ఫీడ్ బ్యాక్ ఇచ్చి ఉంటారు అని విశ్వసనీయంగా అందుతున్న సమాచారం. దీనిపై చంద్రబాబు ఎటువంటి స్టెప్పులు తీసుకుంటారు అనేది వేచి చూడాలి.

ఏపి విభజన, అమరావతి కేసుల విచారణ వేరువేరుగానే.. విచారణ 28వ తేదీకి వాయిదా వేసిన సుప్రీం కోర్టు

 

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?