Krishna Mukunda Murari: స్టార్ మా సరి కొత్త సీరియల్ కృష్ణ ముకుంద మురారి తొ స్మాల్ స్క్రీన్ మెగాస్టార్ ‘ప్రభాకర్ పునః ప్రవేశం’, దేవత సీరియల్ ఫైనల్ ఎపిసోడ్ ముగిసిన తరువాత దాని స్థానంలో ప్రసారం అవుతున్న కొత్త సీరియల్ కృష్ణ ముకుంద మురారి. ఇప్పటికే డిస్నీ+ హాట్‌స్టార్ లో మొదటి ఎపిసోడ్ చూసిన ప్రేక్షకులు పాజిటివ్ రివ్యూ తో స్పందిస్తున్నారు, ఇక Krishna Mukunda Murari Episode 1 ప్రివ్యూ ఇంకా హైలైట్స్ చదివి కృష్ణ ముకుంద మురారి సీరియల్ చూడాలో వొద్దో మీరే నిర్ణయించుకోండి

కృష్ణ ముకుంద మురారి లో అఖండ చిన్నారి… కథ ఏంటంటే…
కృష్ణ అమ్మ కోరిక తను డాక్టర్ చదవాలని.. పేద వాళ్లకు వైద్యం ఉచితంగా చేయాలని వాళ్ళ అమ్మ చిన్నప్పుడే తన నుంచి ప్రమాణం తీసుకుంటుంది.. వాళ్ళ అమ్మ ఆరోగ్య కారణాల కారణాలు చిన్నప్పుడే చనిపోతుంది. కృష్ణ కి అమ్మ దూరం అవుతుంది. తను చనిపోవడంతో కృష్ణకి అమ్మానాన్న రెండు తానే అయ్యి వాళ్ళ తనని పెంచుతాడు. అందుకని కృష్ణకు తన తండ్రిపై ఎనలేని ప్రేమ.. రేపు తనని పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లేటప్పుడు కూడా తనతో పాటు తన తండ్రి కూడా రావాలనేది కృష్ణ కోరిక.. కండిషన్ కూడా.. అయితే తనని పెళ్లి చూపులు చూడటానికి వచ్చిన అతను మాత్రం తన కోరికను అంగీకరించడు…

కృష్ణను శివ అనే అతను గాఢంగా ప్రేమిస్తాడు కానీ కృష్ణకుమాత్రం అతనంటే ఇష్టం ఉండదు తను ఉండే ఏరియాకి అతను ఒక డాన్ లాంటి వాడు.. కృష్ణ తన అభిప్రాయాన్ని తన నుదుటి మీద రాయమని అంటాడు కృష్ణ తన నుదుటి పై ఏకంగా Loser అని రాస్తుంది.. అది గమనించుకోకుండా శివ ఆ అక్షరాలనే తన నుదుటిపై పచ్చబొట్టు వేయించుకోవాలని అనుకుంటాడు అలా టాటూ ఇవ్వడానికి వచ్చిన అతను అన్నా అది lover కాదు loser అని అంటడు.. నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరో కానీ తను నిన్ను చీట్ చేసింది అని అంటడు.. నాకు సంతోషం లేకుండా చేసిన తనకి సంతోషంగా ఉండటానికి వీల్లేదు అని శివ డిసైడ్ అవుతాడు..

ఈరోజు కృష్ణ తండ్రి పుట్టిన రోజు కావడంతో తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని అనుకుంటుంది. తన తండ్రి ఓ ఎస్ ఐ.. అప్పటికే ఇంటి ముందు కానిస్టేబుల్స్ ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇప్పుడే వస్తాను అని స్టేషన్ కి వెళ్తాడు. వాళ్ళ నాన్న వచ్చేసరికి కృష్ణ ఆయన పుట్టినరోజు కి కావలసిన ఏర్పాట్లు అన్ని చేస్తుంది. తనకోసం ఒక సూట్ ను కూడా తీసుకొని వస్తుంది. అది వేసుకునేలోపే వాళ్లు నాన్నకి అర్జెంటు కాల్ వస్తుంది. సార్ ఇక్కడ నన్ను ఎవరు చంపేస్తున్నారు. అర్జెంటుగా రండి అని అనగానే కృష్ణ వాళ్ళ నాన్న కార్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు..
Relates Post: Devatha: దేవత సీరియల్ కథ ఇదే… పార్ట్ -2 కూడా ఉందా?

Krishna Mukunda Murari: కృష్ణ వాళ్ళ ఇంటికి ఉన్న లైటింగ్ ను శివ ఆఫ్ చేయిస్తాడు బలవంతంగా కృష్ణ రూమ్ లోకి వెళ్లిపోతాడు..
మురారి ఈ సీరియల్ లో హీరో.. తను ఐపీఎస్.. తనకి పోస్టింగ్ కృష్ణ వాళ్ళ ఊరే వస్తుంది.. శివ కోపంగా కృష్ణతో ఇప్పుడు కి ఇప్పుడు నిన్ను నేను ఏమైనా చేయొచ్చు కానీ అలా చేయను.. డాక్టర్ అవ్వాలనుకుంటున్న కృష్ణ కి ఆ ఫోటోల వైపు చూస్తూ ఇది నీ కల..

ఇది నా కల అంటూ అద్దం మీద 12.12.2022 శివ వెడ్స్ కృష్ణ అని రాసి దానిని చూయిస్తూ ఇది నా కల.. నీ కల మర్చిపో అంటాడు.. కృష్ణ ఏడుస్తూ కూర్చుంటుంది.. తన పక్కనే ఉన్న నెమలీక మీద తన కన్నీటి బొట్లు రాలి ఆ నెమలీక ఎగిరి మురారి చేతికి వెళ్తుంది.. ఇక ఎలా కృష్ణ మురారి కలుస్తారు అనేది చూడాలి.